Namo Express trains : కొంకణ్ వెళ్లే భక్తుల కోసం నమో ఎక్స్‌ప్రెస్ రైళ్లు

వినాయక చవితి సందర్భంగా మహారాష్ట్రలో కొంకణ్ వెళ్లే భక్తుల కోసం బీజేపీ ఆరు నమో ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనుంది. బీజేపీ డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ గురువారం ముంబైలోని దాదర్ జంక్షన్ నుంచి తొలి రైలును జెండా ఊపి ప్రారంభించారు....

Namo Express trains : కొంకణ్ వెళ్లే భక్తుల కోసం నమో ఎక్స్‌ప్రెస్ రైళ్లు

Namo Express train

Updated On : September 15, 2023 / 12:41 PM IST

Namo Express trains : వినాయక చవితి సందర్భంగా మహారాష్ట్రలో కొంకణ్ వెళ్లే భక్తుల కోసం బీజేపీ ఆరు నమో ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనుంది. బీజేపీ డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ గురువారం ముంబైలోని దాదర్ జంక్షన్ నుంచి తొలి రైలును జెండా ఊపి ప్రారంభించారు. (BJPs Namo Express trains) గణేష్ చతుర్థి పండుగను పురస్కరించుకుని భక్తులకు రవాణా ఏర్పాట్లు చేశారు. మొదటి రైలు గురువారం రాత్రి ముంబైలోని దాదర్ జంక్షన్ నుంచి కొంకణ్‌కు బయలుదేరింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. (devotees going to Konkan)

Greater Noida : గ్రేటర్ నోయిడాలో లిఫ్ట్ కూలి నలుగురి దుర్మరణం

కొంకణ్ వెళ్లే భక్తుల కోసం బీజేపీ 300 బస్సులను కూడా ఏర్పాటు చేసింది. బిజెపి ఎమ్మెల్యే నితీష్ రాణే ఇప్పుడు హిందూ పండుగలను బీజేపీ ప్రభుత్వం చాలా ఉత్సాహంగా జరుపుకుంటుందని ట్వీట్ చేశారు. ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలను జరుపుకోవడానికి లక్షలాది మంది ప్రజలు ముంబయి నుంచి తమ స్వస్థలమైన కొంకణ్‌కు వెళతారు.

Cheetah Project : కునో నేషనల్ పార్కులో రేడియో కాలర్స్ వల్ల చీతాలు మృతి చెందలేదు…ప్రాజెక్ట్ చీఫ్ ఎస్పీ యాదవ్ వెల్లడి

కొంకణ్‌లోని అతిపెద్ద పండుగలలో ఒకటిగా పరిగణిస్తారు. 10 రోజుల పాటు జరిగే ఈ పండుగ మహారాష్ట్రలో అత్యంత విస్తృతంగా జరుపుకునే పండుగలలో ఒకటి. రైలు, బస్సు టిక్కెట్లు పొందడానికి ప్రజలు నానా పాట్లు పడుతుంటారు.