Bomb Threat to RBI: ఆర్‭బీఐ ప్రధాన కార్యాలయాన్ని బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపులు

ఆర్‌బీఐ కార్యాలయంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ సహా 11 చోట్ల పేల్చివేతకు సంబంధించి బెదిరింపులు వచ్చాయి. ఎంఆర్‌ఏ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Bomb Threat to RBI: ఆర్‭బీఐ ప్రధాన కార్యాలయాన్ని బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపులు

ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లు రాజీనామా చేయాలని ఈమెయిల్ లో డిమాండ్ చేశారు. ఆర్‌బీఐ కార్యాలయంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ సహా 11 చోట్ల పేల్చివేతకు సంబంధించి బెదిరింపులు వచ్చాయి. ఎంఆర్‌ఏ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.