Parliament Adjourned : భారతీయుల పట్ల అమెరికా చర్యలపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన.. మధ్యాహ్నానికి ఉభయసభలు వాయిదా

Parliament Adjourned : ఎంపీల నినాదాల కారణంగా సభ ప్రారంభమైన కొద్దిసేపటికే పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.

Parliament Adjourned : భారతీయుల పట్ల అమెరికా చర్యలపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన.. మధ్యాహ్నానికి ఉభయసభలు వాయిదా

Both Houses of Parliament adjourned

Updated On : February 6, 2025 / 12:10 PM IST

Parliament Adjourned : భారతీయులను అవమానకరంగా అమెరికా వెనక్కి పంపిన ఘటనపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళనకు దిగాయి. వెనక్కి పంపిన భారతీయులకు చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేసి యుద్ధ విమానంలో వెనక్కి పంపడంపై ఉభయ సభల్లో ఆందోళన రేకిత్తించింది.

భారతీయులను అమానవీయంగా అమెరికా వెనక్కి పంపడంపై ఉభయసభల్లో సభలో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. భారతీయులను వెనక్కి పంపడం, అగౌరవపరచడంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

ఈ వ్యవహారంపై సభలో చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానాలను ఉభయసభల సభాపతులు తిరస్కరించారు. వాయిదా తీర్మానాలను తిరస్కరించడంపై కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీల ఆందోళనకు దిగారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి.

సభ సమావేశమైన వెంటనే, ప్రతిపక్ష సభ్యులు, ఎక్కువగా కాంగ్రెస్ ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నిస్తూ లేచి నిలబడ్డారు. ప్రభుత్వం వారి ఆందోళనలను తీవ్రంగా పరిగణించిందని చెబుతూ స్పీకర్ ఓం బిర్లా ఆందోళన చేస్తున్న సభ్యులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు.

“ఇది విదేశాంగ విధానానికి సంబంధించిన విషయం. విదేశానికి కూడా సొంత నియమాలు, నిబంధనలు ఉన్నాయి. మీరు మధ్యాహ్నం మీ సమస్యలను లేవనెత్తవచ్చు. ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగడానికి అనుమతించవచ్చు” అని ఆయన అన్నారు. అయితే, నిరసన తెలుపుతున్న సభ్యులు స్పీకర్ విజ్ఞప్తిని పట్టించుకోకుండా నిరసనలు కొనసాగించారు, ఆ తర్వాత స్పీకర్ బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

104 మంది అక్రమ భారతీయ వలసదారులతో కూడిన అమెరికా సైనిక విమానం బుధవారం అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. అక్రమ వలసదారులపై కఠిన చర్యలలో భాగంగా డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వెనక్కి పంపిన భారతీయుల మొదటి బ్యాచ్ ఇదే.

వీరిలో 33 మంది హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు చెందినవారు, 30 మంది పంజాబ్ కు చెందినవారు, ముగ్గురు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కు చెందినవారు, ఇద్దరు చండీగఢ్ కు చెందినవారు ఉన్నారు.