Kerala : పోలీసుల మీద దాడి చేయడానికి కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చాడు.. అతని స్కెచ్ ఏంటంటే?
సాధారణంగా కుక్కలు దొంగల్ని పట్టుకుంటాయి. ఇక్కడ సీన్ రివర్స్.. ఓ కుక్కల పెంపకందారుడు ఖాకీ రంగు దుస్తులు ధరించే పోలీసులపై దాడి చేసేలా తన దగ్గర ఉన్న కుక్కలకు శిక్షణ ఇచ్చాడు. అతని స్కెచ్ వెనుక రీజన్ ఏంటంటే?

Kerala
Kerala : కేరళలో కుక్కల పెంపకం దారుడు ఖాకీ రంగు ధరించే వ్యక్తులపై దాడి చేసేలా కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఖాకీ రంగు ధరించేది పోలీసులే కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అసలు కారణం తెలిస్తే షాకవుతారు.
Worlds tallest dog dies : ప్రపంచంలోనే అత్యంత పొడవైన డాగ్ జుయస్ క్యాన్సర్‌తో మృతి
కేరళ పోలీసులు కొట్టాయం జిల్లాలోని కుక్కల పెంపకం కేంద్రంపై దాడి చేసి 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం ‘డెల్టా కె9’ పేరుతో ఉన్న ఈ కేంద్రం వాస్తవానికి గంజాయిని విక్రయించడానికి అడ్డాగా మారింది. దాడి సమయంలో అక్కడ కుక్కల సంరక్షణ చూసే రాబిన్ జార్జ్ అనే వ్యక్తి తప్పించుకున్నాడు. పెంపుడు జంతువుల కేంద్రం నెపంతో అక్కడ రాబిన్ జార్జ్ గంజాయిని విక్రయిస్తూ ఖాకీ రంగు దుస్తులు ధరించిన వ్యక్తులపై దాడి చేసేలా కుక్కలకు శిక్షణ ఇచ్చాడు.
Mumbai : కుక్కల మెడలో QR కోడ్ .. తప్పిపోయిన డాగ్స్ ట్రాక్ చేయడానికి క్రియేట్ చేసిన ఇంజనీర్
పోలీసులు దాడి చేసిన సందర్భంలో కుక్కలను అదుపులోకి తీసుకోవడానికి నానా తంటాలు పడ్డారు. ఈ కేంద్రంలో పిట్‌బుల్స్, రోట్ వీలర్స్‌తో సహా 15 కుక్కలను అదుపులోకి తీసుకున్నారు. రాబిన్ ఈ కేంద్రాన్ని అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కోసారి ప్రజలు వెకేషన్లలో వెళ్లినపుడు వారి కుక్కలను కూడా రాబిన్ వద్ద విడిచిపెట్టేవారట. అలా వారి నుంచి రోజుకి రూ.1000 దాకా రాబిన్ వసూలు చేసేవాడట. ప్రస్తుతం పోలీసులు రాబిన్ జార్జ్‌ను వెతికే పనిలో పడ్డారు.