Viral video : పెళ్లిలో డ్యాన్స్ ఇరగదీసిన వధూవరులు

పెళ్లి కూతురు అంటే సిగ్గు పడుతూ కూర్చునే రోజులు పోయాయి. ట్రెండ్ మారింది. తల వంచుకుని అడుగులోఅడుగు వేసుకుంటూ..ముత్తయిదువలు తీసుకొస్తుంటే సిగ్గులొలుకుతూ వచ్చి పెళ్లి పీటలమీద కూర్చునేది వధువు. కానీ ఇప్పుడలా కాదు సంగీత్ లో స్టెప్పులతో ఇరగదీస్తున్నారు.అలా ఓ పెళ్లిలో వధూవరుల డ్యాన్స్ చూసి తీరాల్సిందే..

Viral video : పెళ్లిలో డ్యాన్స్ ఇరగదీసిన వధూవరులు

Bride And Groom's Super Dance

Updated On : July 2, 2021 / 1:36 PM IST

Bride and groom’s super dance : పెళ్లి కూతురు అంటే సిగ్గు పడుతూ కూర్చునే రోజులు పోయాయి. ట్రెండ్ మారింది. తల వంచుకుని అడుగులోఅడుగు వేసుకుంటూ..ముత్తయిదువలు తీసుకొస్తుంటే సిగ్గులొలుకుతూ వచ్చి పెళ్లి పీటలమీద కూర్చునేది వధువు. కానీ ఇప్పుడలా కాదు సంగీత్ లో స్టెప్పులతో ఇరగదీస్తున్నారు పెళ్లికూతుళ్లు. అలా ఓ పెళ్లిలో అందరూ సందడి సందడిగా డ్యాన్స్ చేస్తుంటే వరుడు బిక్కముఖం వేసుకుని అటూ ఇటూ చూస్తున్నాడు. పోనీ ఏదైనా సరదగా..సరసాలాడుకుందామంటే వధువు దూరంగా నిలబడి ఉంది.

పెళ్లికి వచ్చినవారంతా పాటలకు డ్యాన్సులు వేస్తున్నారు. ఈ క్రమంలో డ్యాన్స్ వేస్తున్న ఓయువతి పక్కనే నిలబడిన వధువును చేయి పట్టి తీసుకొచ్చి డ్యాన్స్ వేయమంది. అంతే అప్పటి వరకూ ఓ పక్కన కుదురుగా నిలబడి వధువు డ్యాన్స్ వేయటం స్టార్ట్ చేసింది. వరుడు కూడా జత కలవటంతో ఇద్దరూ చక్కగా డ్యాన్స్ ఇరగదీశారు. తేరి అఖ్యా కా యో కాజల్. దుల్హా దుల్హాన్ కా యో కాజల్ పాటకు వధూవరులిద్దరూ డ్యాన్స్ ఇరగదీశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వధువు ఎర్రటి లెహంగా వేసుకుని తలపై ముసుగుతో చక్కగా స్టెప్పులు వేస్తుంటే జత కలిసిన వరుడు ఉత్సాహంగా స్టెప్పులేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.