Bride Gave Triple Talaq to Groom: పెళ్లైన 12 గంటల్లోనే భర్తకు ఊహించని షాక్ ఇచ్చిన భార్య.. ఏం జరిగిందో తెలిస్తే షాకవుతారు
పెళ్లి సమయంలో తమకు వడ్డిస్తున్న భోజనంపై పెళ్లి ఊరేగింపులో ఉన్న వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ వారిని కొట్టాడంటూ వధువు సోదరుడితో వరుడు గులాం నబీ గొడవ పడ్డాడు

Bihar News: వివాహాన్ని గుర్తుండిపోయేలా చేసుకోవాలని అనుకుంటారు. అందుకోసం తమకు నచ్చిన రీతిలో భిన్నంగా చేసేందుకు ప్లాన్ చేస్తారు. పెళ్లిలో వధువు గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది, వరుడు తన కాబోయే భార్యను వేదికపైకి స్వాగతిస్తాడు. ఇలా అయితే, కొన్ని సార్లు వివాహాల్లో ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. అవి వివాహ విచ్ఛిన్నానికి దారితీస్తాయి. అలాంటి ఉదంతమే బిహార్ రాజధాని పాట్నాలో వెలుగులోకి వచ్చింది. ఆదివారం (అక్టోబర్ 29) పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో పెళ్లి జరిగిన 12 గంటల్లోనే తన భర్తకు ‘ట్రిపుల్ తలాక్’ చెప్పింది నవ వధువు.
వెలుగులోకి వచ్చిన విడాకులకు కారణం తెలిస్తే షాక్ అవుతారు. వివాహ వేడుకలో వధూవరుల తరఫు వారి మధ్య భోజనం విషయంలో గొడవ జరిగింది. పెళ్లి సమయంలో తమకు వడ్డిస్తున్న భోజనంపై పెళ్లి ఊరేగింపులో ఉన్న వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ వారిని కొట్టాడంటూ వధువు సోదరుడితో వరుడు గులాం నబీ గొడవ పడ్డాడు. ఇరువర్గాల తల్లిదండ్రులు, బంధువులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అప్పటికే పరిస్థితి అదుపు తప్పింది.
దీంతో వధువు పెళ్లిని పెటాకులు చేసుకునేందుకు సిద్ధమైంది. ఇరు కుటుంబాల వారు చాలా ఒప్పించాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. పెళ్లిని రద్దు చేసుకోడానికే ఆమె నిర్ణయించుకుంది. పెళ్లి జరిగిన 12 గంటలకే (ఆదివారం ఉదయం) ఆ మహిళ వరుడికి ‘ట్రిపుల్ తలాక్’ చెప్పేసింది. వివాహం పాట్నాలోని ఫుల్వారిషరీఫ్‌లో ఉన్న ఇమామ్ కాలనీలోని కమ్యూనిటీ సెంటర్‌లో జరిగింది. ట్రిపుల్ తలాక్‌ను రాజ్యాంగ విరుద్ధమని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు ప్రకటించడం గమనార్హం. తదనంతరం, జూలై 2019లో ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం అమలులోకి రావడంతో ఆగస్టు 1, 2019 నుండి దేశంలో ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమైంది.