Wrestlers protest: గంగలో విసిరేస్తామన్నారు, ఏమైంది?.. రెజ్లర్లపై మరోసారి విరుచుకుపడ్డ బ్రిజ్ భూషణ్

“వాళ్లు ఎందుకు ఇలా చేస్తున్నారో వారు మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరు. పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది. వారి అభ్యర్థనపై ఎఫ్‌ఐఆర్ చేశారు. ఇప్పుడు విచారణ కొనసాగుతోంది. నేను తప్పు చేసినట్లు తేలితే, నన్ను అరెస్టు చేస్తారు. దానితో నాకు ఎలాంటి సమస్య లేదు’’ అని అన్నారు.

Wrestlers protest: గంగలో విసిరేస్తామన్నారు, ఏమైంది?.. రెజ్లర్లపై మరోసారి విరుచుకుపడ్డ బ్రిజ్ భూషణ్

Brij Bhushan Sharan Singh: నిరసన చేస్తున్న రెజ్లర్లపై (Wrestlers) రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‭ (Brij Bhushan Sharan Singh) మరోసారి విరుచుకుపడ్డారు. మెడల్స్‭ను గంగలో విసిరేస్తామని వెళ్లిన వారు, వాటిని తికాయత్‭కు ఎందుకు ఇచ్చారని విమర్శించారు. మరో ఐదు రోజుల సమయంతో విరమణ తీసుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆటగాళ్లు తమ పథకాలను గంగలో విసిరేయాలనుకుంటే తామేం చేయగలమంటూ స్పందించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఇండియా చీఫ్ ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం ఏంటని, ఇక ఆయన ఆ స్థానంలో ఉండి ఏం లాభం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Narendra Modi : మోదీ తొమ్మిదేళ్ల పాలనపై ఏమనుకుంటున్నారు?

ఇంతకు ముందు పలుమార్లు రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసర ఆందోళన చేస్తూ కొత్తగా రెజ్లింగులోకి వచ్చే వారిని భవిష్యత్ ప్రశ్నార్థకం చేస్తూన్నారంటూ మండిపడ్డారు. రెజ్లర్ల నిరసన వల్ల తమకేం పోయేదేమీ లేదంటూ సైతం వ్యాఖ్యానించారు. ఇక తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “రెజ్లర్లు తమ పతకాలను గంగలో ముంచడానికి వెళ్లారు. కానీ ఆ పని చేయడానికి బదులు, వారు తమ పతకాల్ని రాకేశ్ తికాయత్‭కు ఇచ్చారు. అది వారి స్టాండ్. మనం ఏమి చేయగలం?” అని అన్నారు.

Congress Action Plan 2024 : కాంగ్రెస్‌ మిషన్‌-2024కు యాక్షన్‌ ప్లానేంటి?

రాజీనామా చేసే ప్రసక్తే లేదని బ్రిజ్ భూషణ్ అన్నారు. వాస్తవానికి తన పదవీకాలం ముగిసిందని, తొందరలో ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. “వారు దర్యాప్తు చేస్తే చేయనివ్వండి. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు. అంతా ఢిల్లీ పోలీసులకు వదిలేశాం” అని అన్నారు. “వాళ్లు ఎందుకు ఇలా చేస్తున్నారో వారు మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరు. పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది. వారి అభ్యర్థనపై ఎఫ్‌ఐఆర్ చేశారు. ఇప్పుడు విచారణ కొనసాగుతోంది. నేను తప్పు చేసినట్లు తేలితే, నన్ను అరెస్టు చేస్తారు. దానితో నాకు ఎలాంటి సమస్య లేదు’’ అని అన్నారు.

Rahul Gandhi : అమెరికా వెళ్లిన రాహుల్ గాంధీ.. 10 రోజులపాటు యూఎస్ లోనే

హరిద్వార్‌లోని హర్ కి పౌరి ఘాట్ వద్ద రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సంగీతా ఫోగట్ నిరసన వ్యక్తం చేశారు. బ్రిజ్ భూషణ్‭పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్‌తో సహా పలువురు అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్‭ను అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నెల రోజులకు పైగా ఆందోళన చేపట్టారు. అయితే ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో తాము సాధించిన పథకాలను గంగలో విసిరేస్తామని మంగళవారం హరిద్వార్ చేరుకున్నారు.