Rahul Gandhi : అమెరికా వెళ్లిన రాహుల్ గాంధీ.. 10 రోజులపాటు యూఎస్ లోనే

జూన్ 4 అమెరికా లోని మాడిసన్ స్క్వేర్ లో 5 వేల మంది ఎన్ఆర్ఐలతో రాహుల్ ర్యాలీ నిర్వహించనున్నారు. వాషింగ్టన్ మరియు కాలిఫోర్నియాలలో ప్యానల్ డిస్కషన్స్ నిర్వహించనున్నారు.

Rahul Gandhi : అమెరికా వెళ్లిన రాహుల్ గాంధీ.. 10 రోజులపాటు యూఎస్ లోనే

Rahul Gandhi (1)

Updated On : May 30, 2023 / 10:39 PM IST

Rahul Gandhi America : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికాకు వెళ్లారు. 10 రోజులపాటు రాహుల్ గాంధీ అమెరికాలో ఉండనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా స్టన్ ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులతో రాహుల్ ఇంటరాక్ట్ అవ్వనున్నారు. వాషింగ్టన్ డీసీ చట్టసభ సభ్యులతో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

జూన్ 4 అమెరికా లోని మాడిసన్ స్క్వేర్ లో 5 వేల మంది ఎన్ఆర్ఐలతో రాహుల్ ర్యాలీ నిర్వహించనున్నారు. వాషింగ్టన్ మరియు కాలిఫోర్నియాలలో ప్యానల్ డిస్కషన్స్ నిర్వహించనున్నారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించనున్నారు.

Congress Action Plan 2024 : కాంగ్రెస్‌ మిషన్‌-2024కు యాక్షన్‌ ప్లానేంటి?

జూన్ 22న అమెరికా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు ముందే రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.