Burmese Python : జనావాసాల్లో కొండచిలువ.. హడలిపోయిన ప్రజలు

జనావాసాల్లో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లా ఫుల్‌బరి ఏరియాలో కొండచిలువ కనిపించడంతో స్థానికులు హడలిపోయారు.

Burmese Python : జనావాసాల్లో కొండచిలువ.. హడలిపోయిన ప్రజలు

Burmese Python

Updated On : November 22, 2021 / 9:19 AM IST

Burmese Python : జనావాసాల్లో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లా ఫుల్‌బరి ఏరియాలో కొండచిలువ కనిపించడంతో స్థానికులు హడలిపోయారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు కొండచిలువను బంధించారు.. అనంతరం అక్కడి నుంచి తరలించారు.

చదవండి : Snake Venom : అమ్మకానికి పాము విషం- ధర తెలిస్తే

కాగా ఇది 10 అడుగుల పొడవున్న బర్మీస్ ఫైథాన్ అని అధికారులు తెలిపారు. కొండచిలువను అధికారులు అటవీ ప్రాంతంలో వదిలివేశారు. ఈ రకమైన కొండచిలువలు ఆగ్నేయ ఆసియా దేశాల్లో అధికంగా కనిపిస్తుంటాయి.

చదవండి : Snake Gourd : పోషకాల్ని పొట్టలో నింపుకున్న పొట్లకాయ..తింటే ఎన్ని లాభాలో