Bus Video: బస్సులో మంటలు.. 50 మంది ప్రయాణికులు వెంటనే అందులోంచి..
థానెలోని సెంట్రల్ మైదాన్ వద్దకు ఆ బస్సు వచ్చిన సమయంలో మంటలు అంటుకున్నాయి.

Bus Video
Bus Video – Thane : మహారాష్ట్ర(Maharashtra)లో దాదాపు 50 మంది ప్రయాణికులు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వారంతా ఓ బస్సులో వెళ్తున్న సమయంలో దానికి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు దాని నుంచి కిందకు దిగారు.
బస్సు మంటల్లో సగం కాలిపోయింది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానెలో ఇవాళ చోటుచేసుకుంది. పౌర రవాణా బస్సులో ప్రయాణికులు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని థానె మునిసిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ యాసిన్ తాడ్డీ మీడియాకు తెలిపారు.
ప్రయాణికులు అందరూ బస్సులో నుంచి దిగాక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రయాణికులు అంతా నార్పోలి నుంచి చెండని కోలివాడ ప్రాంతానికి వెళ్లడానికి బస్సు ఎక్కారని అధికారులు తెలిపారు. థానెలోని సెంట్రల్ మైదాన్ వద్దకు ఆ బస్సు వచ్చి సమయంలో మంటలు అంటుకున్నాయని వివరించారు.
బస్సు డ్రైవర్, కండక్టర్ ఆ మంటలను గుర్తించి వెంటనే బస్సు దిగాలని ప్రయాణికులకు చెప్పారని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లే బస్సుకు మంటలు అంటుకున్నట్లు అనుమానిస్తున్నారు.
◆महाराष्ट्र: ठाणे नगर परिवहन बस के इंजन में आग लगी
◆ 40-50 यात्री समय रहते वाहन से उतर गए,
◆किसी के घायल होने की सूचना नहीं
#Maharashtra
#Thane #BusFire pic.twitter.com/6gzcsyYmug— Anurag Mishra (@Anuragm91) July 30, 2023