Hero Bus Driver : గుండెపోటు వచ్చినా 48 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్
ఆకస్మికంగా గుండెపోటు వచ్చినా 48 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవరు వీరోచిత ఉదంతం ఒడిశా రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. సనా ప్రధాన్ అనే బస్సు డ్రైవర్ 48 మంది ప్రయాణికులను ఎక్కించుకొని భువనేశ్వర్ నగరానికి వెళుతుండగా ఒక్కసారిగా అతనికి గుండెపోటు వచ్చింది....

Bus Driver
Hero Bus Driver : ఆకస్మికంగా గుండెపోటు వచ్చినా 48 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవరు వీరోచిత ఉదంతం ఒడిశా రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. సనా ప్రధాన్ అనే బస్సు డ్రైవర్ 48 మంది ప్రయాణికులను ఎక్కించుకొని భువనేశ్వర్ నగరానికి వెళుతుండగా ఒక్కసారిగా అతనికి గుండెపోటు వచ్చింది. గుండెపోటుతో తుది శ్వాస విడిచే ముందు డ్రైవర్ సనా ప్రధాన్ బస్సును గోడకు ఢీకొట్టాడు. దీంతో బస్సు గోడకు ఢీకొని నిలిచి పోవడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
Also Read : Mukesh Ambani : రిలయన్స్ ముకేశ్ అంబానీకి మరో బెదిరింపు…ఈ సారి రూ.200 కోట్లు ఇవ్వాలని…
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఛాతీ నొప్పి రావడంతో స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయినా తమను కాపాడి, డ్రైవర్ మరణించాడని ప్రయాణికులు చెప్పారు. ఈ ఘటన కంధమాల్ జిల్లాలోని పబురియా గ్రామ సమీపంలో రాత్రి జరిగిందని ప్రయాణికులు తెలిపారు.
‘‘గుండెనొప్పి రావడంతో డ్రైవర్ మరింత దూరం బస్సును నడపలేడని గ్రహించాడు. దీంతో అతను బస్సునుర రోడ్డు పక్కన ఉన్న గోడకు ఢీకొట్టాడు, దాని తర్వాత బస్సు ఆగిపోవడంతో ప్రయాణీకుల ప్రాణాలను రక్షించగలిగాడు’’ అని టికాబలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్స్పెక్టర్ కళ్యాణమయి సేంద చెప్పారు. మా లక్ష్మీ ప్రైవేట్ బస్సు సాధారణంగా కంధమాల్‌లోని సారన్‌ఘర్ నుంచి జి ఉదయగిరి మీదుగా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు ప్రతి రాత్రి తిరుగుతుందని ఎస్ఐ చెప్పారు.
Also Read : Mexico : మెక్సికోలో అకాపుల్కో హరికేన్ విధ్వంసం…39 మంది మృతి
ఈ సంఘటన తర్వాత డ్రైవరు సనా ప్రధాన్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, గుండె ఆగిపోవడంతో అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత మరో డ్రైవర్ ప్రయాణికులతో బస్సును తన గమ్యస్థానానికి తీసుకెళ్లారు. డ్రైవర్ ప్రధాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు వివరించారు.