హెల్మెట్ పెట్టుకొని బస్సులు నడిపిన డ్రైవర్లు.. కారణం ఏమిటంటే..? వీడియోలు వైరల్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు హెల్మెట్లు పెట్టుకొని బస్సు నడుపుతుండటం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Bus Drivers Helmet In Bengal
Bus Driver wore Helmet In Bengal Bandh : బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవటం సర్వసాధారణం. ఆ సమయంలో హెల్మెట్ పెట్టుకోవాలనే ప్రభుత్వం నిబంధనలు కూడా ఉన్నాయి. కానీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు హెల్మెట్లు పెట్టుకొని బస్సు నడుపుతుండటం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక మీడియా డ్రైవర్లను ప్రశ్నించగా.. అసలు విషయాన్ని వెల్లడించారు.
Also Read : వైసీపీకి బిగ్‌షాక్.. ఎంపీ మోపిదేవి వెంకటరమణ గుడ్‌బై..? త్వరలో టీడీపీ గూటికి..
బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాలలో ఇటీవల ట్రెయినీ వైద్యురాలు దారుణ హత్యాచారానికి, హత్యకు గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీలు, నిరసనలతో రాష్ట్రంలోని ప్రధాన నగరాలన్ని అట్టుడుకుతున్నాయి. నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ లను ప్రయోగిస్తున్నారు. గాల్లోకి కాల్పులుసైతం జరిపారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ బుధవారం రాష్ట్రంలో బంద్ కు పిలుపునిచ్చింది.
బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో దుకాణాలు ఆందోళన కారులు బంద్ చేయించారు. బంద్ కు ప్రభుత్వం అనుమతి లేకపోవటంతోపాటు.. ప్రభుత్వ ఉద్యోగులంతా విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదే సమయంలో దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్లు భద్రతకోసం అధికారులు హెల్మెట్లు భద్రతగా అందజేశారు. దీంతో ఆర్టీసీ డ్రైవర్లు హెల్మెంట్లు ధరించి బస్సులు నడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#WATCH | BJP’s 12-hour ‘Bengal Bandh’: Drivers of North Bengal State Transport Corporation (NBSTC) buses seen wearing helmets, in Cooch Behar
A bus driver says, “We are wearing helmets because of the bandh called by the BJP today…The department has given us the helmets to… pic.twitter.com/rfdxJv2kRq
— ANI (@ANI) August 28, 2024
Also Read : ముందు రాము, ఆ తర్వాత రెమో, ఇప్పుడేమో అపరిచితుడు..! పూటకో మాట మాట్లాడుతున్న సంజయ్ రాయ్