Light Combat Helicopters : రూ.62వేల కోట్లు, 156 యుద్ధ హెలికాప్టర్లు.. భారీ డీల్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి కార్యకలాపాల కోసం 156 హెలికాప్టర్లను భారత సైన్యం (90), భారత వైమానిక దళం మధ్య విభజించనున్నారు

Light Combat Helicopters : భారీ డీల్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుండి భారత సైన్యం, వైమానిక దళం కోసం 156 మేడిన్ ఇండియా లైట్ కంబాట్ (తేలిక పాటి యుద్ధ హెలికాప్టర్లు) ప్రచంద్ హెలికాప్టర్ల కొనుగోలుకు అతిపెద్ద రక్షణ ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ ఒప్పందం విలువ రూ.62వేల కోట్లు. ఈరోజు జరిగిన సమావేశంలో భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
జూన్ 2024లో HAL 156 లైట్ కంబాట్ హెలికాప్టర్ల కోసం ఆర్డర్ అందుకుంది. ఈ 156 హెలికాప్టర్లలో 90 భారత సైన్యానికి, 60 భారత వైమానిక దళానికి కేటాయించబడతాయి. ఈ హెలికాప్టర్లు కర్ణాటకలోని HAL తుమ్ కూర్ ప్లాంట్‌లో తయారు చేయబడతాయి.
Also Read : చూస్తే దిమ్మతిరిగిపోయేంత పసిడి.. భారత్‌లోని ఈ రాష్ట్రంలో బంగారం నిక్షేపాలు గుర్తింపు
చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి కార్యకలాపాల కోసం 156 హెలికాప్టర్లను భారత సైన్యం (90), భారత వైమానిక దళం మధ్య విభజించనున్నారు దాంతో పాటు ఉద్యోగాలను సృష్టించడానికి, దేశంలో ఏరో స్పేస్ ఎకో సిస్టమ్ విస్తరించడానికి ఇది ఒక ప్రధాన అడుగు అవుతుంది” అని రక్షణ వర్గాలు తెలిపాయి.
లైట్ కంబాట్ ప్రచంద్ హెలికాప్టర్లు 5వేల నుండి 16వేల 400 అడుగుల ఎత్తులో ల్యాండింగ్, టేకాఫ్ చేయగల ఏకైక దాడి హెలికాప్టర్లు. ఈ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు సియాచిన్ తూర్పు లడఖ్ వంటి ఎత్తైన ప్రాంతాలలో ఆపరేషన్‌కు అనువైనవి.
Also Read : వేణుస్వామి ఉగాది పంచాంగం.. ఈ ఏడాది వీళ్లకు పదవీగండం..
”LCH ఒక యుద్ధ హెలికాప్టర్. ప్రపంచంలోని చాలా దేశాలు వినియోగిస్తున్నాయి. 5వేల నుంచి 16వేల 400 అడుగుల ఎత్తులో ల్యాండ్ అవ్వగలవు, ఎగరగలవు. సియాచిన్ గ్లేసియర్, తూర్పు లడఖ్ వంటి ఎత్తైన ప్రాంతాలకు ఇవి చాలా అనుకూలం. ఈ హెలికాప్టర్లు ఆకాశం నుండి భూమికి, ఆకాశం నుండి ఆకాశానికి క్షిపణులను పేల్చగలవు. దీని నుంచి ఏ యుద్ధ విమానాన్ని అయినా ధ్వంసం చేయవచ్చు” అని అధికారులు తెలిపారు.