Terrorist : కెనడా గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ ఉగ్రవాదిగా ప్రకటన

ఖలిస్తానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు అనుబంధంగా ఉన్న కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను హోం మంత్రిత్వ శాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది.....

Terrorist : కెనడా గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ ఉగ్రవాదిగా ప్రకటన

Lakhbir Singh

Updated On : December 30, 2023 / 8:12 AM IST

Terrorist : ఖలిస్తానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు అనుబంధంగా ఉన్న కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను హోం మంత్రిత్వ శాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. 33 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ ఖలిస్తానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ కి చెందినవాడు. లఖ్‌బీర్ సింగ్ 2021వ సంవత్సరంలో మొహాలిలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్‌పై రాకెట్ దాడి ప్రణాళికలో పాల్గొన్నాడు.

ALSO READ : Vande Bharat trains : రైల్వే ప్రయాణికులకు శుభవార్త… ఆరు వందేభారత్ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా

2022లో టార్న్ తరణ్‌లోని సర్హాలి పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఆర్పీజీ దాడి ఘటనలో లాండా పేరు కూడా ఉంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన లఖ్‌బీర్ సింగ్ గత కొన్నేళ్లుగా కెనడాలో నివశిస్తున్నాడు. భారతదేశంపై కుట్ర పన్నుతున్న ఇతన్ని ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది.