M K Stalin : కావేరి బేసిన్‌లో చమురు,గ్యాస్ నిక్షేపాలు వెలికితీత బిడ్లు రద్దు చేయండి : స్టాలిన్
తమిళనాడు లోని కావేరి బేసిన్‌లోని వడతేరు బ్లాక్ లో చమురు గ్యాస్ నిక్షేపాలు వెలికితీత బిడ్లు రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు.

Cancel Bids For Hydrocarbon Extraction In Cauvery Basin Stalin Urges Pm Modi
M K Stalin : తమిళనాడు లోని కావేరి బేసిన్‌లోని వడతేరు బ్లాక్ లో చమురు గ్యాస్ నిక్షేపాలు వెలికితీత బిడ్లు రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ఆయన మోడీకి ఒకలేఖ రాశారు.
పెట్రోలియం, సహాజవాయువుల మంత్రిత్వ శాఖ జూన్ లో కావేరి బేసిన్‌లోని పుదుక్కోటై జిల్లాలోని వడతేరు వద్ద చమురు, గ్యాస్ నిక్షేపాలు వెలికితీత కోసం బిడ్లను ఆహ్వానించిందని.. ఈ ప్రాజెక్టు కావేరి బేసిన్ లోని రైతులకు ముప్పుగా మారనుందని ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ముప్పు వాటిల్లే ఈ ప్రాజెక్ట్ ను ఆపేలా సంబంధిత మంత్రిత్వశాఖను ఆదేశించాలని స్టాలిన్ ప్రధానని కోరారు.
ఈ అంశంలో వెంటనే జోక్యం చేసుకుని రైతాంగాన్ని ఆదుకోవాలని..అలాగే భవిష్యత్తులో ఈ తరహా ప్రాజెక్టులపై ముందుకెళ్లే ముందు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించేలా పెట్రోలియం శాఖను ఆదేశించాలని స్టాలిన్ ఆ లేఖలో ప్రధానిని కోరారు.
శతాబ్దాల కాలంగా కావేరి బేసిన్ అన్నపూర్ణ లాంటిదని ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని ఆయన పేర్కోన్నారు. లక్షలాదిమంది రైతులు వ్యవసాయంపై ఆధార పడి జవిస్తున్నారని ఆయన లేఖలో వివరించారు. కావేరి బేసిన్ లో సహజవాయు నిక్షేపాలు వెలికితీయటానికి ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని.. ప్రజల మనోభావాలు, తమిళనాడుప్రభుత్వం చట్టబధ్దమైన చట్టాలను అధికారులు పట్టించుకోకపోవటం దురదృష్టకరం అని ఆయన అన్నారు.