ఇదేందిరా బాబూ : హెల్మెట్ పెట్టుకోకుండా కారు నడిపాడని ఫైన్

దురదృష్టం వెంటాడితే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుందని సామెత. దీనికి కేరళ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. సాధారణంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం. ఇది సేఫ్టీ కోసం.. కారు నడిపినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాం.
ఇదికూడా సేఫ్టీ కోసమే. కానీ కేరళలో సీన్ రివర్స్ అయ్యింది. కారు నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ వేసారు పోలీసులు. అలాగే బైక్ పై వెళ్తున్న వ్యక్తి సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఫైన్ వేసిన విచిత్ర ఘటనలు కేరళలో చోటుచేసుకున్నాయి. ఈ రెండు విచిత్రాల గురించి తెలుసుకుందాం..
కేరళకు చెందిన గోపాకుమార్ అనే వ్యక్తి టాటా నెక్సన్ కారులో బైటికి వెళ్లారు. దారిలో పోలీసులు ఆపారు. హెల్మెట్ పెట్టుకోలేదని చలానా విధించారు. ఇదేమని అడిగితే రూ.100 కట్టాల్సిందేనన్నారు. ఎంత చెప్పినా వారు వినకపోవటంతో గోపాకుమార్ రూ.100 కట్టేశారు. ఆ రసీదును గోపాకుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్ గా మారింది.
వ్యక్తి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తిని చెక్‌చేసిన ట్రాఫిక్ పోలీసులు.. సీటు బెల్టు పెట్టుకోలేదంటూ జరిమానా విధించారు. చలానా మెషీన్లు సక్రమంగా పనిచేయనందుకే ఇటువంటి పొరపాట్లు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు.