Viral Video: వామ్మో.. నడిరోడ్డుపై ఐదుగురి మీదకు దూసుకెళ్లిన ‘ఘోస్ట్ ఆటో’

డ్రైవర్ కింద పడిపోయినప్పటికీ మనుషుల మీదకు దూసుకెళ్లిన ఈ ఆటోను ‘ఘోస్ట్ ఆటో’ అని నెటిజన్లు అంటున్నారు.

Viral Video: వామ్మో.. నడిరోడ్డుపై ఐదుగురి మీదకు దూసుకెళ్లిన ‘ఘోస్ట్ ఆటో’

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ ఆటోను బైక్ ఢీకొట్టింది. దీంతో ఆటోనుంచి డ్రైవర్‌ కిందకు పడిపోయాడు. అప్పటికే ఇద్దరికి గాయాలయ్యాయి. డ్రైవర్ కింద పడిపోయాక కూడా ఆటో అక్కడే చుట్టూ తిరుగుతూ దూసుకెళ్లింది.

దీంతో మరో ముగ్గురిపై నుంచి అది వెళ్లింది. గాయాలపాలైన వారు అందరూ పాదాచారులే. కొల్హాపూర్ షాహుపురిలోని పాట్కీ ఆసుపత్రికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఆటోడ్రైవర్, ద్విచక్ర వాహనదారుడి నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో దేశంలో ప్రతిరోజు అనేక ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ప్రతిరోజు ఇటువంటి ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

వదిలిపెట్టం విచారణ చేపడతాం.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్