CBSE 12th : రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి

CBSE 12th రిజల్ట్స్ ప్రకటించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. 2021, జూలై 30వ తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదలవుతాయని CBSE ప్రకటించింది. ఫలితాల కోసం విద్యార్థులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

CBSE 12th : రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి

Cbse

Updated On : July 30, 2021 / 12:36 PM IST

CBSE 12th Result : CBSE 12th రిజల్ట్స్ ప్రకటించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. 2021, జూలై 30వ తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదలవుతాయని CBSE ప్రకటించింది. ఫలితాల కోసం విద్యార్థులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. cbseresults.nic.inలో ఫలితాలు చూడొచ్చు. జూలై 31లోపు ఫలితాలను ప్రకటించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఫలితాలను ఈ రోజు ప్రకటిస్తున్నారు. 12వ తరగతి రెగ్యులర్ పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే..ప్రైవేటు విద్యార్థుల పరీక్షలు రద్దు చేయలేదు.

Read More : cervical cancer: కరోనా తరువా మహిళల్లో సర్వికల్ కాన్సర్..

ఇక మార్కుల విషయానికి వస్తే…10, 11వ తరగతి, ప్రీ బోర్డు పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఫలితాలను నిర్ణయిస్తారు. 10వ తరగతి పరీక్షలో 30శాతం మార్కులు, 11వ తరగతిలో 40 శాతం మార్కులు, 12వ తరగతి యూనిట్, మిడ్ టర్మ్, ప్రీ బోర్డు పరీక్షల ఆధారంగా మార్కులు నిర్ణయిస్తారు. అధికారిక వెబ్ సైట్ల నుంచి మాత్రమే మార్క్ షీట్, సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మార్క్ షీట్ లో ఏదైనా లోపం పాఠశాలను సంప్రదించాలి.

Read More : Fireballs Slipping : అకాశం నుంచి జారి పడ్డ ఫైర్ బాల్స్! షాక్ కు గురైన ప్రజలు

cbseresults.nic.in వెబ్ సైట్ ను సంప్రదించాలి.
వెబ్ సైట్ లో 12వ ఫలితాలపై లింక్ చేయాలి.
తగిన సమాచారం ఇవ్వాలి.
ఫలితం డిస్ ప్లే అవుతుంది.
కావాల్సి ఉంటే ప్రింట్ తీసుకోవచ్చు.