CBSE Board Exams 2025: సీబీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం.. ఇకనుంచి సీసీటీవీ నిఘాలో పరీక్షల నిర్వహణ

వచ్చే ఏడాది సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలు భాతదేశంలోని 8వేల పాఠశాలల్లో, విదేశాల్లోని 26 దేశాల్లో కలిపి సుమారు 44 లక్షల మంది విద్యార్థులు

CBSE Board Exams 2025: సీబీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం.. ఇకనుంచి సీసీటీవీ నిఘాలో పరీక్షల నిర్వహణ

Updated On : September 28, 2024 / 11:51 AM IST

CBSE Board Exams 2025: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో నిర్వహించబోయే 10, 12 బోర్డు పరీక్షలు సీసీటీవీ నిఘాలో జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు అనుబంధ పాఠశాలకు ఆదేశాలు జారీ చేసింది. 2025లో జరగనున్న బోర్డు పరీక్షా కేంద్రాల్లో నిఘా కెమెరాలు తప్పనిసరి చేసినట్లు అందులో పేర్కొంది. ఈ విషయాన్ని తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది.

Also Read : Jobs in AP: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అక్టోబర్ 10వరకు ఛాన్స్..

వచ్చే ఏడాది సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు భాతదేశంలోని 8వేల పాఠశాలల్లో, విదేశాల్లోని 26 దేశాల్లో కలిపి సుమారు 44 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని బోర్డు అంచనా వేసింది. పరీక్షల నిర్వహణపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రాసిన లేఖలో సీబీఎస్ఈ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సన్యాం భరద్వాజ్ కీలక సూచన చేశారు. పరీక్షా కేంద్రాలుగా ఎంపికచేసే అన్ని పాఠశాలలు తప్పనిసరిగా సీసీటీవీ పర్యవేక్షణలో ఉండాలని స్పష్టం చేశారు. సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా పరీక్షా హాళ్లలోని అన్ని ప్రాంతాలను కవర్ చేయాలని చెప్పారు. కెమెరాలు తప్పని సరిగా అధిక రిజల్యూషన్ తో ఉండాలి.. అంతేకాక.. కెమెరాలు పరీక్ష హాల్ మొత్తాన్ని రికార్డు చేసేలా ఏర్పాటు చేయాలని, పుటేజీలను సురక్షితంగా భద్రపర్చాలని భరద్వాజ్ సూచించారు.

Also Read : Scholarships : తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త.. ఉన్నత చదువులకు స్కాలర్‌షిప్‌ కోసం ఇలా చేయండి

సీసీటీవీ నిఘా సౌకర్యం లేని ఏ పాఠశాలను పరీక్షా కేంద్రంగా ఎంపిక చేయొద్దని భరద్వాజ్ పాఠశాలలకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. రికార్డ్ పుటేజీ సంబంధిత అధికారులు మాత్రమే చూసేందుకు వీలుంటుందని, పరీక్షా ఫలితాలు వచ్చిన రెండు నెలల వరకు ఈ పుటేజీ భద్రంగా ఉంటుందని తెలిపారు. ప్రతీ పది గదుల పర్యవేక్షణకు ఒక వ్యక్తిని నియమిస్తున్నట్లు తెలిపారు. సీసీటీవీల ఏర్పాటుతో పరీక్షల విధానంలో ఎటుంటి ఆటంకం లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భరద్వాజ్ తెలిపారు. ఇదిలాఉంటే.. సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయి.