కేంద్ర కేబినెట్‌ భేటీ : రాష్ట్రపతి ప్రసంగం, కీలక బిల్లులు, కోనా వైరస్ పై చర్చ 

కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. రాష్ట్రపతి ప్రసంగం, కీలక బిల్లులు, కోనా వైరస్, వివిధ దేశాలతో ఒప్పందాలు సహా కీలక అంశాలపై చర్చిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 29, 2020 / 08:13 AM IST
కేంద్ర కేబినెట్‌ భేటీ : రాష్ట్రపతి ప్రసంగం, కీలక బిల్లులు, కోనా వైరస్ పై చర్చ 

Updated On : January 29, 2020 / 8:13 AM IST

కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. రాష్ట్రపతి ప్రసంగం, కీలక బిల్లులు, కోనా వైరస్, వివిధ దేశాలతో ఒప్పందాలు సహా కీలక అంశాలపై చర్చిస్తున్నారు.

కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. రాష్ట్రపతి ప్రసంగం, కీలక బిల్లులు, కోనా వైరస్, వివిధ దేశాలతో ఒప్పందాలు సహా కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధాని నివాసంలో భేటీ కొనసాగుతోంది. పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్‌పై ప్రధానంగా చర్చ జరుపుతున్నారు. బడ్జెట్‌లో ప్రస్తావించే ప్రజాకర్షక పథకాలు, పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే కీలక బిల్లుపై చర్చిస్తున్నారు. 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై కూడా చర్చిస్తున్నారు. పార్లమెట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్న నేపథ్యంలో… ఆయన ప్రసంగానికి ఆమోదముద్ర వేసే ఛాన్స్ ఉంది. అలాగే పలు దేశాలతో కుదుర్చుకోబోయే ద్వైపాక్షిక ఒప్పందాలకు కూడా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

మరోవైపు… ఏపీ శాసనమండలి రద్దు అంశం ఉత్కంఠ రేపుతోంది. మండలి రద్దు తీర్మానం ఇప్పటికే కేంద్రానికి చేరడంతో…కేబినెట్‌ భేటీలో దీనిపై చర్చించే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా దీనికి కేంద్రంతో ఆమోద ముద్ర వేయించాలనుకుంటున్న వైసీపీ… ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఆ పని జరిగిపోతుందని ఆశాభావం వ్యక్తంచేస్తోంది. 

అటు.. టీడీపీ మాత్రం.. అంత ఈజీగా కాదంటోంది. మండలి రద్దు తీర్మానానికి కేంద్రం ఇప్పట్లో ఆమోదం తెలిపే అవకాశమే లేదంటోంది. మరోవైపు… అసలు ఈ కేబినెట్ భేటీలో మండలి రద్దు అంశం చర్చకు వచ్చే అవకాశమే లేదని కొందరు చెబుతున్నారు. దీంతో కేంద్ర కేబినెట్ భేటీ ఆసక్తికరంగా మారింది.