Sankranthi Rangoli : సంక్రాంతికి ముగ్గుల పోటీ.. మొదటి బహుమతి రూ.6 లక్షలు

సంక్రాంతి పండుగకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ బంపర్ ఆఫర్ ఇస్తుంది. ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి ప్రధమ బహుమతిగా రూ. 6 లక్షలు ఇవ్వనుంది

Sankranthi Rangoli

Sankranthi Rangoli : సంక్రాంతి పండుగకు ప్రధాన ఆకర్షణగా నిలిచేది ముగ్గులు.. ఇంట్లోని ఆడవారు వేకువజామునే లేచి ముగ్గులు వేస్తుంటారు. రంగురంగుల ముగ్గులతో ఊరువాడ కోలాహలంగా ఉంటుంది. ఇక గ్రామంలో జరిగే ముగ్గుల పోటీలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అయితే ఈ ఏడాది కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ.. యవతులు, మహిళలకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తుంది. పండుగ రోజు అందమైన ముగ్గులు వేస్తే ఏకంగా రూ.6 లక్షలు నగదు బహుమతి ఇవ్వనుంది.

చదవండి : Kishan Reddy : ఏపీ రాజధానిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్…

పాటలు పాడి గెలిచినా బహుమతులు అందచేయనున్నట్లు కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి కిషన్ రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జాతీయస్థాయిలో ప్రథమ బహుమతి రూ.6 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.5 లక్షలు, తృతీయ బహుమతి రూ.4 లక్షలు, రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లక్ష, ద్వితీయ బహుమతి రూ.75 వేలు, తృతీయ బహుమతి రూ.50 వేలు.

చదవండి : Kishan Reddy : ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది : కిషన్ రెడ్డి

జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.5 వేలు, తృతీయ బహుమతి రూ.3 వేలు ఇవ్వనున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలకు www.indiaculture.nic.in ను సంప్రదించాలని సూచించారు.