కేంద్ర ఉద్యోగులకు రిటైర్మెంట్ షాక్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు విషయంలో మార్పులు చేసేందుకు కేంద్రం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం పదవీ విరమణ వయస్సును రెండు రకాలుగా నిర్ధారించనున్నారు. (1)33 ఏళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్నవారు (2)60 ఏళ్ళ వయోపరిమితి.

ఈ రెండిటిలో ఏది ముందుయితే దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ సమయానికి ఉద్యోగి రిటైర్ అయ్యేలా నిబంధనలు సవరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ రూపోందించి సంబంధిత దస్త్రాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ ఆమోదానికి పంపినట్లు తెలిసింది.
అక్కడ ఆమోద ముద్రపడితే 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధను అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన 23 ఏళ్లకే ఉద్యోగంలో చేరిన వ్యక్తి 56 ఏళ్లకే రిటైర్ అవుతారు. ఈ నిబంధన అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వం సంస్ధల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు రిటైర్ అవుతారు.