India Rs.75 Coin : నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా.. రూ.75 కాయిన్ ను విడుదల చేయనున్న కేంద్రం

కాయిన్​పై రూపీ సింబల్​తో పాటు 75గా డినామినేషన్​ వాల్యూ ఉండనుంది. కాయిన్​ ఎగువ అంచుపై సంసద్​ సంకుల్​ అని దేవనగరి స్క్రిప్ట్​లో, దిగువ అంచున పార్లమెంట్​ కాంప్లెక్స్​ ఉండనుంది.

India Rs.75 Coin : నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా.. రూ.75 కాయిన్ ను విడుదల చేయనున్న కేంద్రం

new parliament Rs.75 Coin

Updated On : May 26, 2023 / 10:36 AM IST

Central Government Rs.75 Coin : భారత మార్కెట్ లోకి త్వరలో 75 రూపాయల కాయిన్ రానుంది. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 75 రూపాయల నాణాన్ని విడుదల చేయనుంది. 35గ్రాముల బరువుతో 75 రూపాయిల నాణెం ఉండనుంది. 50శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం నికెల్​, 5శాతం జింక్​తో 75 రూపాయిల నాణెం తయారు చేయనున్నారు.

నాణెం వ్యాసం 44ఎంఎంలుగా ఉండనుంది. ఆశోక స్తంభంపై ఉండే నాలుగు సింహాల చిహ్నం దాని కింద ‘సత్యమేవ జయతే’ అక్షరాలు ఉండనున్నాయి. నాణేనికి ఎడమవైపు దేవనగరి లిపిలో భారత్​ అన్న పదం, కుడివైపు ఆంగ్లంలో ఇండియా ఉండనుంది.

New Parliament : కొత్త పార్లమెంట్‌లో రాజదండం..దాని చరిత్ర, ప్రాధాన్యత ఏంటో తెలుసా..? భారత స్వాతంత్ర్య ప్రకటనకు రాజదండానికి సంబంధమేంటీ?

కాయిన్​పై రూపీ సింబల్​తో పాటు 75గా డినామినేషన్​ వాల్యూ ఉండనుంది. కాయిన్​ ఎగువ అంచుపై సంసద్​ సంకుల్​ అని దేవనగరి స్క్రిప్ట్​లో, దిగువ అంచున పార్లమెంట్​ కాంప్లెక్స్​ ఉండనుంది. ప్రస్తుతం మార్కెట్​లో రూ. 1, రూ. 2, రూ. 5 , రూ.10,రూ.20 కాయిన్లు వాడకంలో ఉన్నాయి. త్వరలో రూ.75 కాయిన్ వాడకంలోకి రానుంది.