CRPF Exams: కేంద్ర ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం.. తెలుగులో సీఆర్పీఎఫ్ పరీక్షలు

ఇప్పటి వరకు ఈ పరీక్ష హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే నిర్వహించేవారు. తాజా నిర్ణయంతో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మళయాలం, కన్నడ, తమిళ్, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపూరీ, కొంకణీ భాషల్లో నిర్వహించనున్నారు.

CRPF Exams: కేంద్ర ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం.. తెలుగులో సీఆర్పీఎఫ్ పరీక్షలు

crpf exam

CRPF Exams: కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ద్వారా నిర్వహించే కేంద్ర భద్రతా దళాల కానిస్టేబుల్ ఎంపిక పరీక్షలను (CRPF Exams) తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సహా పలువురి నుంచి విజ్ణప్తులు అందాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Delhi liquor scam: కేజ్రీవాల్‌కు నోటీసులు అందడంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

వచ్చే ఏడాది నుంచి 13 ప్రాంతీయ భాషల్లో సీఏపీఎఫ్ పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది. స్థానిక యువత ప్రమేయాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ పరీక్ష హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే నిర్వహించేవారు. తాజా నిర్ణయంతో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మళయాలం, కన్నడ, తమిళ్, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపూరీ, కొంకణీ భాషల్లో నిర్వహించనున్నారు.

Karnataka Polls: కావాలనే ఆలస్యం చేసిన జేడీఎస్.. కాంగ్రెస్, బీజేపీ నేతలే టార్గెట్