Covaxin Production : విదేశాల్లో కోవాగ్జిన్ ఉత్పత్తి!
దేశీయంగా రెండు కోవిడ్-19 వ్యాక్సిన్ లు అవుతున్నప్పటికీ..వ్యాక్సిన్ కొరత రాష్ట్రాలను వేధిస్తోన్న విషయం తెలిసిందే.

Centre Explores Possibility Of Covaxin Production Outside India
Covaxin Production దేశీయంగా రెండు కోవిడ్-19 వ్యాక్సిన్ లు అవుతున్నప్పటికీ..వ్యాక్సిన్ కొరత రాష్ట్రాలను వేధిస్తోన్న విషయం తెలిసిందే. తగినన్ని డోసులు లేక కొన్ని చోట్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశం అవసరాల మేరకు వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
కొవాగ్జిన్ ఉత్పత్తిని విదేశాల్లో చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మే18నే కేబినెట్ అంతర్గతంగా సమావేశం నిర్వహించినట్లు సమాచారం. డీబీటీ(డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ)తో చర్చించి కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని విదేశాల్లో చేపట్టాలని, ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి తీసుకెళ్లడం,సాంకేతిక బదిలి ప్రాతిపదికన భారత్‌లో మెడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను ఇతర కంపెనీలు తయారు చేసేందుకు స్వచ్ఛంద లైసెన్స్ మంజూరు సహా పలు కీలక అంశాలపై కేబినెట్ అంతర్గత సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకాకు ఇండియాలో మరిన్ని లైసెన్సులు కేబినెట్ ఆలోచించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అస్ట్రాజెనెకాను సంప్రదించాలని విదేశాంగశాఖకు ఆదేశించింది. ఫైజర్ టీకా విషయంపై అంతర్గత వాణిజ్యం, పరిశ్రమలను ప్రోత్సహించే విభాగం, నీతి ఆయోగ్, విదేశాంగ శాఖ, న్యాయ శాఖ కార్యదర్శితో సంప్రదించడం వంటి విషయాలను కేబినెట్ చర్చించింది.
ఇక, కొవిషీల్డ్ కోసం ముడి పదార్థాల సరఫరా అడ్డంకులను పరిష్కరించడానికి విదేశాంగ శాఖ, బయోటెక్నాలజీ విభాగం(డీబీటీ) రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నాయి. బయోసేప్టీ లెవల్స్-3 సదుపాయం ఉన్న తయారీదారులతో పాటు భారతదేశంలో ఉత్పాదక స్థలాలను పెంచడానికి, అలాంటి సదుపాయాన్ని ఏర్పాటు చేయగల వారిని గుర్తించాలని డీబీటీ, డీసీజీఐను ప్రభుత్వం కోరింది.