Indian Air Force : భారత వైమానిక దళం యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.10వేల కోట్లు.. రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం

భారత వైమానిక దళం కొత్తగా యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. 12 సుకోహి-30 ఎంకేఐ యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కి రూ.10,000 కోట్ల టెండర్‌ను జారీ చేసింది.....

Indian Air Force : భారత వైమానిక దళం యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.10వేల కోట్లు.. రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం

Indian Air Force fighter jets

Indian Air Force : భారత వైమానిక దళం కొత్తగా యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. 12 సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కి రూ.10,000 కోట్ల టెండర్‌ను జారీ చేసింది. భారత వైమానిక దళంలో యుద్ధ విమానాల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత 20 ఏళ్లలో 12 సుఖోయ్ యుద్ధ విమానాలు వివిధ ప్రమాదాల్లో కోల్పోవడం వల్ల ఏర్పడిన ఖాళీలను ఈ కొత్త విమానాల కొనుగోలుతో పూరించనుంది.

ALSO READ : Telangana Assembly Elections 2023 : తెలంగాణ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో నేరచరితులే అధికం

భారతదేశంలో ఈ విమానాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 60 శాతం స్వదేశీ వస్తువులతో తయారు చేయనుంది. 260 కంటే ఎక్కువ విమానాలున్న ఇండియన్ ఎయిర్ ఫోర్సులో అత్యంత అధునాతన యుద్ధ విమానాలు రానున్నాయి. ఈ యుద్ధ విమానాలు ఎయిర్ క్షిపణులు, బ్రహ్మోస్ ఎయిర్ క్షిపణులు, బాంబులను తీసుకెళ్లగలవు.

ALSO READ : Telangana Assembly Elections 2023 : తెలంగాణ ఎన్నికల పర్వంలో గల్ఫ్ కార్మికుల గోస

అధిక, తక్కువ వేగంతోనూ ఈ కొత్త యుద్ధ విమానాలు సంక్లిష్ఠమైన విన్యాసాలు చేస్తాయని వైమానిక దళం అధికారులు చెప్పారు. ఎయిర్-టు-ఎయిర్ రీఫ్యూయలింగ్ సామర్థ్యంతో కూడిన ఈ విమానం లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ చేయనున్నాయి. రాఫెల్ ఫైటర్ జెట్ విమానాలతో పాటు బలమైన యుద్ధ విమానాలను భారత వైమానిక దళం అమ్ముల పొదిలో చేరనున్నాయి.

ALSO READ : Chandrababu Case : బాబు బెయిల్‎పై సుప్రీమ్ కోర్టుకు ఏపీ సీఐడీ

బాలాకోట్ వైమానిక దాడుల్లోనూ సుఖోయ్ యుద్ధ విమానాలను వినియోగించారు. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణి భారత వైమానిక దళం సామర్ధ్యాన్ని పెంచుతుందని భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి చెప్పారు. సుఖోయ్ యుద్ధ విమానాలు అధునాతన ఆయుధ వ్యవస్థతో అప్ గ్రేడ్ చేశారు.