Covid Vaccine Doses : 15 రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా 1.92 కోట్ల డోసులు
వచ్చే 15 రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కోటి 92 లక్షల డోసుల వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. రేపటి నుంచి మే 31 మధ్య ఈ వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలకు అందుతాయని చెప్పారు.

1.92 Crore Covid Vaccine Doses To States And Uts With In 15 Days Of Period
Covid Vaccine Doses to States and UTs : వచ్చే 15 రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కోటి 92 లక్షల డోసుల వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. మే 16 నుంచి మే 31 మధ్య ఈ వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలకు అందుతాయని చెప్పారు.
ఇందులో కోటి 62 లక్షల కొవిషీల్డ్ డోసులు, 29 లక్షల 49 వేల కొవాగ్జిన్ డోసులు ఉంటాయని ఆయన తెలిపారు. వినియోగిస్తున్న తీరు, రెండో డోసులు పొందాల్సిన వారి ఆధారంగా ఈ కేటాయింపులు జరపనున్నట్లు జవదేకర్ చెప్పారు.
మేలో ఇప్పటి వరకూ కోటి 70 లక్షల వ్యాక్సిన్ డోసులను సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ కేటాయింపులకు
సంబంధించి డెలివరీ షెడ్యూల్‌ను ముందుగానే అందరితో పంచుకోనున్నట్లు తెలిపింది. దీని ద్వారా సదరు వ్యాక్సిన్లను సక్రమంగా వినియోగించేలా ఆయా రాష్ట్రాలు ప్రణాళికలు
వేసుకుంటాయని చెప్పింది.
ఈ వ్యాక్సిన్ డోసులను కేవలం 45 ఏళ్లు పైబడిన వాళ్లకు మాత్రమే వేస్తారు. ఇవి కాకుండా వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి రాష్ట్రాలు, ప్రైవేటు హాస్పిటల్స్ నేరుగా కొనుగోలు చేసేందుకు మేలో 4 కోట్ల 39లక్షల వ్యాక్సిన్ డోసులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది.