వాట్సప్‌తో జాగ్రత్త..హెచ్చరించిన సీఈఆర్‌టీ

  • Published By: madhu ,Published On : November 21, 2019 / 01:59 AM IST
వాట్సప్‌తో జాగ్రత్త..హెచ్చరించిన సీఈఆర్‌టీ

Updated On : November 21, 2019 / 1:59 AM IST

వాట్సప్‌తో జాగ్రత్త అంటోంది కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూర్టీ సంస్థ. ఎందుకంటే తెలియని వారి వీడియో ఫైళ్లను ఓపెన్ చేస్తే..కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడిస్తోంది. ద కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) సంస్థ మూడు రోజుల క్రితం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఎంపీ 4 ఫైళ్ల సాయంతో సాఫ్ట్ వేర్‌లోని లోపాల ఆధారంగా హ్యకర్లు మీ ఫోన్లలోకి చొరబడవచ్చునని తెలిపింది. అనుమతులు కోరకుండానే..సమాచారాన్ని సేకరించడంతో పాటు ఫోన్ పనిచేయకుండా చేయొచ్చని తెలిపింది. సాఫ్ట్ వేర్ లోపంతో కలిగే ప్రభావం వినియోగదారులపై పడలేదని వాట్సప్ చెబుతోంది.

వందలాది మంది భారతీయ వినియోగదారులపై ఇజ్రాయెల్‌కు చెందిన పెగానస్ నిఘా సాఫ్ట్ వేర్ సాయంతో గుర్తు తెలియని సంస్థలు నిఘా పెట్టాయని వాట్సాప్ ఇటీవల భారత సర్కార్‌కు తెలిపిన నేపథ్యంలో ఈ ఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది. హ్యాకింగ్, ఫిషింగ్ తదితర సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం CERT నోడల్ సంస్థగా ఏర్పాటు చేయడం తెలిసిందే. సమస్యను అధిగమించేందుకు వాట్సాప్ సాఫ్ట్ వేర్‌ను అప్ గ్రేడ్ చేసుకోవడం మేలని సంస్థ సూచించింది.

నిఘా వ్యవహారంపై అప్రమత్తంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. నిఘా అంశాన్ని చర్చించాలా వద్దా ? అన్నదానిపైనా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు, చర్చల్లో సభ్యలు మధ్య ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. 
Read More : 100W సూపర్ ఛార్జర్ ఇదిగో : 17 నిమిషాల్లోనే.. ఈ ఫోన్లో ఫుల్ ఛార్జింగ్