Chennai Rains: చెన్నైలో భారీ వర్షాలు.. మరో మూడు రోజులు కొనసాగే అవకాశం

వర్షాలతో చెన్నై వాసులకు ఊరట లభించింది. కొద్ది రోజులుగా ఉక్కపోతలతో ఇబ్బందులు పడుతున్న నగర వాసులు ఉపశమనం పొందారు.

Chennai Rains: చెన్నైలో భారీ వర్షాలు.. మరో మూడు రోజులు కొనసాగే అవకాశం

Chennai Rains

Updated On : August 10, 2023 / 4:37 PM IST

Chennai Rains: తుపాను ప్రభావంతో తమిళనాడులో (Tamil Nadu) వర్షాలు ప్రారంభమయ్యాయి. రాజధాని చెన్నైతో పాలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్సాలు కురుస్తున్నారు. అడంబాక్కం, రామానుజన్ ఐటీసిటీ, తిరువాన్మియూర్, టీనగర్, వెస్ట్ మాంబలం, పెరుంబక్కం వేలచ్చేరిలో వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో వడగాళ్ల వాన కురిసింది. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ నిపుణులు వెల్లండించారు.

వర్షాలకు చెన్నైలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు ప్రయాణం కష్టమవుతోంది. దక్షిణ చెన్నైలోని ఓల్డ్ మహాబలిపురం మార్కెట్, ఈస్ట్ కోస్ట్ రోడ్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. చాలా రోజుల తర్వాత వాతావరణం చల్లబడటంతో చెన్నై వాసులకు ఉక్కపోతల నుంచి ఉపశమనం లభించింది. వారాంతం వరకు వర్షాలు కొనసాగాలని కోరుకుంటున్నారు. అయితే చెన్నై ఉత్తర భాగంలో వర్షాలు లేవని అంటున్నారు.

Also Read: అమెరికాలోని హవాయిలో కార్చిచ్చు బీభత్సం.. 36 మంది సజీవ దహనం

2021 రిపీటవుతుందా?
రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున చెన్నైలో భారీ వర్షాలు కురిసిన విషయాన్ని నగర వాసులు గుర్తుచేసుకుంటున్నారు. 2021, ఆగస్టు 10న చెన్నై నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాటి వర్షపాతం వివరాలను ట్విటర్ లో షేర్ చేసి.. మళ్లీ అదే స్థాయిలో వర్షం కురుస్తుందా అని అడుగుతున్నారు.

చెన్నై వర్షాల గురించి నగరవాసులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. వర్షాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ట్విటర్ లో షేర్ చేస్తున్నారు. వాతావరణ వివరాలు కూడా ట్విటర్ లో పోస్ట్ చేస్తున్నారు.