తనను ప్రేమించలేదని యువకుడిపై ఈ అమ్మాయి ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనుకుందో చూడండి.. 11 రాష్ట్రాలనూ భయపెట్టింది..
రోబోటిక్స్ చదువుకుని, డెలాయిట్ సంస్థలో పనిచేస్తున్న ఆ అమ్మాయి.. టెక్నాలజీని వాడి..

ఓ యువకుడిని చెన్నైకు చెందిన ఓ అమ్మాయి “వన్ సైడ్ లవ్” చేసింది. అయితే, ఆమె ప్రేమను అతడు ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి ప్రతీకారం తీర్చుకోవడానికి భారీ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా దేశంలోని 11 రాష్ట్రాలను కూడా భయపెట్టింది. చివరకు ఆమెను పోలీసులు అరెస్టు చేసి, వివరాలు తెలిపారు.
రోబోటిక్స్ చదువుకుని డెలాయిట్ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న రెని జోషిల్దా అనే యువతి.. డివిజ్ ప్రభాకర్ అనే యువకుడిని వన్ సైడ్ లవ్ చేసింది. 2025 ఫిబ్రవరిలో ప్రభాకర్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో ప్రభాకర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని అతడి పేరుతో అనేక ఫేక్ ఈ-మెయిల్ అకౌంట్లు క్రియేట్ చేసింది. ఆ ఈ-మెయిల్ ఐడీలతో వివిధ ప్రాంతాకు ఆమె బాంబు బెదిరింపులు మెసేజ్‌లు పంపింది.
ప్రభాకర్ పేరుతో జోషిల్దా పంపిన ఈ బెదిరింపులు దేశంలోని 11 రాష్ట్రాల్లో అలజడి రేపాయి. పబ్లిక్ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ పంపిన ఈ బెదిరింపులకు అనేక పోలీస్ విభాగాలు సంయుక్తంగా స్పందించాయి. బెదిరింపు ఈ-మెయిల్స్ ఎవరు పంపుతున్నారన్న విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. చివరకు అహ్మదాబాద్‌లోని సైబర్ క్రైం విభాగం జోషిల్దాను గుర్తించి అరెస్టు చేసింది.
జోషిల్దా డార్క్ వెబ్ ద్వారా ఈ బెదిరింపు ఈ-మెయిల్స్‌ను పంపింది. దీంతో తనను ఎవరూ గుర్తుపట్టరని అనుకుంది. ఆ సమయంలో ఆమె చేసిన ఓ చిన్న తప్పిదంతో పోలీసులకు దొరికిపోయింది. చెన్నైలోని ఆమె లొకేషన్‌ను పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. పోలీసులు ఆమె వద్ద నుండి డిజిటల్ డేటా, పలు ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.
తనను ప్రేమించనందుకు ప్రభాకర్‌ను ఇరికించాలన్న ఉద్దేశంతోనే ఆమె ఈ చర్యలకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ఇంత పెద్ద మోసం వెనుక మరెవరైనా ఉన్నారా? లేదా ఆమె ఒంటరిగా చేసిన చర్యలేనా? అన్న కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 11 రాష్ట్రాల పోలీస్ విభాగాలు మిగతా సమాచారాన్ని సేకరిస్తున్నాయి