షాకైన ఊరి జనం : కరెంట్ లేని గ్రామానికి లక్షల్లో బిల్లు

ఆ ఊళ్లో అసలు కరెంట్ లేదు. చీకటి బతుకులే. రాత్రి పూట చీకట్లోనే వంట చేసుకోవాలి. పిల్లలంతా రాత్రి వేళల్లో నూనె దీపాలతోనే చదువుకోవాలి.

  • Published By: sreehari ,Published On : September 21, 2019 / 10:18 AM IST
షాకైన ఊరి జనం : కరెంట్ లేని గ్రామానికి లక్షల్లో బిల్లు

Updated On : September 21, 2019 / 10:18 AM IST

ఆ ఊళ్లో అసలు కరెంట్ లేదు. చీకటి బతుకులే. రాత్రి పూట చీకట్లోనే వంట చేసుకోవాలి. పిల్లలంతా రాత్రి వేళల్లో నూనె దీపాలతోనే చదువుకోవాలి.

ఆ ఊళ్లో అసలు కరెంట్ లేదు. చీకటి బతుకులే. రాత్రి పూట చీకట్లోనే వంట చేసుకోవాలి. పిల్లలంతా రాత్రి వేళల్లో నూనె దీపాలతోనే చదువుకోవాలి. అలాంటి ధీన పరిస్థితుల్లో జీవిస్తున్న గ్రామస్థులకు భారీ షాక్ తగిలింది. కరెంట్ సరఫరా లేని ఆ గ్రామానికి ఎలక్ట్రసిటీ డిపార్ట్ మెంట్ నుంచి పవర్ బిల్లు జారీ అయింది. ఈ ఘటన చత్తీస్ గఢ్ లోని పటేరీలో బల్ రాంపూర్ ప్రాంతం పారా శాన్వాల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీనిపై గ్రామవాసి మాట్లాడుతూ.. ‘గ్రామంలో ఎక్కడ కరెంట్ సరఫరా లేదని, ప్రజలంతా చీకటిలోనే గడపుతున్నారని, చీకట్లోనే వంటలు వండుకుంటున్నామని, పిల్లలు లాంతర్లతో చదువుకుంటున్నారు’ అని వాపోయాడు. ఎలక్ట్రసిటీ డిపార్టమెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై గ్రామస్థులతో పాటు అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

దీనిపై స్పందించిన బల్ రాంపూర్ జిల్లా కలెక్టర్ సంజీవ్ కుమార్ ఝా స్పందిస్తూ.. మీడియా ద్వారా మాకు ఈ సమాచారం అందింది. కరెంట్ బిల్లుల జారీపై విచారణ చేపడుతాం. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు. కరెంట్ సరఫరా లేని వారికి బిల్లులు జారీ చేయడం ఇది తొలిసారి కాదు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే ఒక వెలుగులోకి వచ్చింది. యూపీలోని ఒక వ్యక్తికి భారీ మొత్తంలో కరెంట్ బిల్లు వచ్చింది. ఇంట్లో తీసుకున్న పవర్ కనెక్షన్ కు కేవలం 2 కిలోవాట్లు వాడినందుకు ఏకంగా రూ.128 కోట్లకు పైగా కరెంట్ బిల్లు జారీ చేశారు. 

2019 జనవరిలో యూపీకి చెందిన కన్నాజ్ అనే వ్యక్తికి రూ.23 కోట్ల కరెంట్ బిల్లు జారీ అయింది. 2018 మే నెలలో కూడా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో కూరగాయాల వ్యాపారికి భారీగా కరెంట్ బిల్లు వచ్చింది. రూ.8.64 లక్షల కరెంట్ బిల్లు రావడంతో షాకైన అతడు  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై ఎలక్ట్రసిటీ డిపార్ట్ మెంట్ కూడా వివరణ ఇచ్చింది. ప్రింట్ తప్పుగా పడటం కారణంగా డిసిమల్ పాయింట్ మిస్ అయిందని తెలిపింది.