Bodies in Garbage Vehicle : చెత్త వాహనంలో శవాలు..ఆక్సిజన్ అందక చనిపోయారా?

Covid Bodies In Garbage Vehicle
covid 19 dead bodies taken for cremation in a garbage vehicle : ఈ కరోనా కాలంలో మృతదేహాల దీన దుస్థితి గురించి తెలిస్తే హృదయాలు ద్రవించిపోతున్నాయి. ఏదో కోతి ఛస్తే గోడ అవతల పారేసినట్లుగా మృతదేహాన్ని పారేస్తున్న దారుణ ఘటనల గురించి గత ఏడాదిగా చూస్తునే ఉన్నాం. వింటూనే ఉన్నాం. అటువంటి మరో అత్యంత దారుణ ఘటన ఛత్తీస్ ఘడ్ లో జరిగింది. చెత్తను తరలించే వాహనంలో శవాలను తరలించటం అందరినీ కలచివేస్తోంది.
కరోనా వచ్చినవారు చనిపోగా వారిని తరలించటానికి చెత్తను తరలించే వాహనాలు ఉపయోగించారు. చెత్తను పారేసినట్లుగానే మనుషుల మతదేహాలను ఆ వాహనలో పడేసిన ఘటన చూస్తే మనస్సులను కలచివేస్తోంది. వీరు ఆక్సిజన్ అందకచనిపోయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్ానరు. అలా చనిపోయిన కరోనా రోగులను చెత్త వాహనాల్లో స్మశానాకి తరలించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఎంత కరోనాతో చనిపోతే మాత్రం కనీసం మతదేహాలను అలా పారేయటమేంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళితే..ఛత్తీస్ ఘడ్ లోని రాజ్ నందగావ్ జిల్లాలోని డోంగార్గావ్ లో నలుగురు కోవిడ్ పేషెంట్లు చనిపోయారు. వీరంతా ఆక్సిజన్ అందక చనిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముగ్గురు రోగులు కోవిడ్ కేర్ సెంటర్ లో ఒకరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ప్రాణాలు విడిచారు. దీంతో వారి బంధువులకు సమాచారం అందించారో లేదో తెలీదుగానీ..వీరి మృతదేహాలను చెత్త ఎత్తికెళ్లే వాహనంలో స్మశానికి తరలించడం విమర్శలకు దారి తీసింది.
Chhattisgarh: 4 #COVID19 patients died in Dongargaon block of Rajnandgaon dist y'day allegedly due to non-availability of oxygen. 3 of them died at a COVID Care Centre while the 4th died at a Community Health Centre. They were taken for cremation allegedly in a garbage vehicle. pic.twitter.com/4WSeETlGcx
— ANI (@ANI) April 15, 2021