Lakhimpur violence : లఖింపూర్ బాధిత కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం ప్రకటించిన పంజాబ్,చత్తీస్ ఘడ్ సీఎంలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఆదివారం కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్‌లోని ఒక వాహనం దూసుకెళ్లిన ఘటనతోపాటు అనంతరం జరిగిన ఆందోళన మరణించిన

Lakimpur
Lakhimpur violence ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఆదివారం కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్‌లోని ఒక వాహనం దూసుకెళ్లిన ఘటనతోపాటు అనంతరం జరిగిన ఆందోళన మరణించిన నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించనున్నట్లు ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.
ఒక్కో బాధిత కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని బుధవారం ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘల్, పంజాబ్ సీఎం చరంజిత్ సింగ్ చన్నీ తెలిపారు. హత్యకు గురైన బాధిత రైతు కుటుంబాలకు మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని పంజాబ్ సీఎం చన్నీ ఆరోపించారు. లఖిమ్‌పూర్ ఖేరిలో జరిగిన హింసాకాండతనకు జలియన్‌వాలా బాగ్ ఘటనను గుర్తుకు తెచ్చిందన్నారు.
కాగా,ఆదివారం లఖింపూర్ ఖేరీ జిల్లాలోని టికునియా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్‌లను అడ్డుకున్న రైతులపై రెండు కార్లు దూసుకెళ్లిన ఘటనలో, ఆతర్వాత జరిగిన ఆందోళనలో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రాణాలు కోల్పోయినవారిలో నలుగురు రైతులు,ఓ జర్నలిస్ట్, ముగ్గురు కార్యకర్తలు,కేంద్ర సహాయక మంత్రి కారు డ్రైవర్ ఉన్నారు.
ALSO READ సొంత కాన్వాయ్ లోనే లఖిమ్‌పూర్ కి బయల్దేరిన రాహుల్ గాంధీ