Car doors Locked : ఊపిరి ఆడక కారులోనే కన్నుమూసిన చిన్నారులు

ఆడుకోవటానికని వెళ్లిన చిన్నారుల్ని కారు రూపంలో మృత్యువు కబళించింది. నవ్వుతు తుళ్లుతు వెళ్లిన పిల్లలు విగతజీవులుగా కనిపించటంతో కన్నవారి గుండెలు అవిసేలా ఏడ్చారు.

Car doors Locked : ఊపిరి ఆడక కారులోనే కన్నుమూసిన చిన్నారులు

Car doors Locked

Car doors Locked : ఆడుకోవటానికని వెళ్లిన చిన్నారులు కనిపించకుండాపోయారు. సాయంత్రం అయినా ఇళ్లకు రాలేదు. వారి అమ్మానాన్నలు కంగారుపడి ఎక్కడెక్కడో వెతికారు.కానీ ఎక్కడా వారి ఆచూకీ తెలియలేదు. దీంతో ఆందోళనతో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారుల కోసం గాలించగా వారి ఇంటి సమీపంలోనే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయి కనిపించారు. అంతే కన్నవారి ఆవేదన అంతా ఇంతా కాదు..ఎక్కడెక్కడో వెదికాం కానీ కళ్లముందే ఉన్నా గమనించలేక బిడ్డల్ని కోల్పోయం అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగిన ఈ అత్యంత విషాద ఘటనకు ఓ కారు కారణమైంది…

Free Gurbani Telecast Bill: పంతం నెగ్గించుకున్న భగవంత్ మాన్.. గోల్డెన్ టెంపుల్ గుర్బానీ బిల్లును ఆమోదించిన పంజాబ్ అసెంబ్లీ

నాగ్‌పుర్‌లోని పచ్‌పోలీ పోలీసుస్టేషన్‌ పరిధిలో నివసిస్తోన్న నాలుగేళ్ల తౌఫిఖ్‌ ఫిరోజ్‌ ఖాన్‌,నాలుగేళ్ల అలియా ఫిరోజ్‌ ఖాన్, ఆరేళ్ల అఫ్రిన్‌ ఇర్షద్‌ ఖాన్, ఆరేళ్ల ‌(6) శనివారం (జూన్ 18)సాయంత్రం మూడు గంటల నుంచి కనిపించకుండా పోయారు. వారి నివాసాలకు దగ్గరలోనే ఉన్న ఓ మైదనంలోకి ఆడుకోవటానికి వెళ్లారు. కానీ రాత్రి అవుతున్నా పిల్లలు ఇంటికి రాలేదు. వెదికినా పిల్లల జాడ కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కిడ్నాప్‌ కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి కోసం ఆ ప్రాంతంలో గాలించారు.

అలా ఆదివారం సాయంత్రం వరకు కూడా చిన్నారుల ఆచూకీ తెలియలేదు. కానీ పోలీసులు వెదకటం మానలేదు. ఓ పక్క పోలీసులు, మరోపక్క పిల్లల కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. అలా వెతగ్గా వెతగ్గా ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ముగ్గురు వారి ఇంటికి కేవలం 50 మీటర్ల దూరంలో ఉన్న ఓ తుక్కు దుకాణంలోని ఓ కారులో విగతజీవులుగా కనిపించారు.

Mangoes : కిలో రూ.2.5 లక్షలు విలువైన మామిడి పండ్లు చోరీ.. పండ్ల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే

చిన్నారులు ఆడుకుంటు ఆడుకుంటూ కారు ఎక్కగా డోర్ లాక్ అయిపోయి దాంట్లోనే చిక్కుకుపోయారు. డోర్ లాక్ తో ఊపిరి ఆడక వారు చనిపోయి ఉంటారని పోలీసులు భావించారు. వారు చనిపోయారని ప్రాథమిక నివేదిక కూడా వెల్లడించింది.