CID Inspector : శ్రీనగర్ లో సీఐడీ ఇన్ స్పెక్టర్ ను కాల్చిచంపిన ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్ సిటీ శివార్లలోని కానిపొరలో ఓ సీఐడీ ఇన్​స్పెక్టర్​ను ఉగ్రవాదులు కాల్చిచంపేశారు.

CID Inspector : శ్రీనగర్ లో సీఐడీ ఇన్ స్పెక్టర్ ను కాల్చిచంపిన ఉగ్రవాదులు

Cid Inspector

Updated On : June 22, 2021 / 10:30 PM IST

CID Inspector జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్ సిటీ శివార్లలోని కానిపొరలో ఓ సీఐడీ ఇన్ స్పెక్టర్ ను ఉగ్రవాదులు కాల్చిచంపేశారు. సోపోర్​లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టిన ఒక రోజు అనంతరం ఆ ఘటన జరగడం గమనార్హం.

మంగళవారం సాయంత్రం నౌగామ్ ఏరియాలోని మసీదులో ప్రార్థనలు చేసి ఇంటికి తిరిగెళ్తున్న సీఐడీ ​ఇన్ స్పెక్టర్ పర్వేజ్​ అహ్మద్ దార్​పై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో పర్వేజ్​ తీవ్రంగా గాయపడగా.. ఆయనని హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే పర్వేజ్​ ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు చెప్పారని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పర్వేజ్​ అహ్మద్ దార్​..పరిమ్ పొరా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించేవాడని తెలిపారు. ఇక,ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు, దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు.