Tobacco : సిగరెట్లు, గుట్కా అలవాటు ఉన్నవారికి బిగ్‌షాక్.. భారీగా పెరగనున్న ధరలు

Tobacco : ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై కొత్త సెస్సు విధించనున్నట్లు ప్రభుత్వం బుధవారం నోటిఫై చేసింది.

Tobacco : సిగరెట్లు, గుట్కా అలవాటు ఉన్నవారికి బిగ్‌షాక్.. భారీగా పెరగనున్న ధరలు

Tobacco

Updated On : January 1, 2026 / 2:28 PM IST
  • సింగరేట్, పాన్ మసాలాపై 40శాతం జీఎస్టీ
  • భారీగా పెరగనున్న ధరలు
  • ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి

Tobacco : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ మసాలా, సిగరేట్లు, పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై 40శాతం.. బీడీలపై 18శాతం జీఎస్టీ విధించింది. దీంతోపాటు పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్, పొగాకు, సంబంధిత ఉత్పత్తులకు అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. దీంతో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇవన్నీ అమల్లోకి రానున్నాయి.

పాన్ మసాలా తయారీపై కొత్తగా ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్సు విధించడానికి , పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించడానికి అనుమతించే రెండు బిల్లులను పార్లమెంట్ డిసెంబర్ నెలలో ఆమోదించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ లో చట్టాన్ని ఆమోదించినప్పటికీ.. కొత్త పన్ను విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాన్ని కేంద్రం చెప్పలేదు. తాజాగా.. 2026 సంవత్సరం తొలిరోజు నిర్ణయాల అమలు తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం తాజాగా ప్రకటించింది.

Tobacco

Tobacco

గతేడాది దేశవ్యాప్తంగా జీఎస్టీ 2.0 సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సంస్కరణల ద్వారా గతంలో ఉన్న నాలుగు స్లాబ్‌లను రెండు స్లాబ్‌లకు కుదించింది. ఈ క్రమంలో ఎన్నో వస్తువులపై పన్నులు తగ్గాయి.

స్లాబ్‌ల సంస్కరణల్లో భాగంగా జీఎస్టీ స్లాబ్‌లను గరిష్ఠంగా 18శాతానికి కుదించిన నేపథ్యంలో దేశంలో పొగాకు ఉత్పత్తులపై అంతకుమించి పన్ను విధించే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో కేంద్రం జీఎస్టీ పరిహార సెస్ స్థానంలో కొత్త ఎక్సైజ్ సుంకం, సెస్‌ను తీసుకొస్తుంది. ఈ మేరకు పార్లమెంట్ లో రెండు బిల్లులను డిసెంబర్‌లో ఆమోదించిన కేంద్రం.. తాజాగా.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వీటిని అమలు చేస్తామని ప్రకటించింది.

కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం.. పాన్ మసాలాపై ఇప్పటికే 40శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దీనికి సెస్ అదనం. తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సమకూరే నిధులను జాతీయ భద్రత బలోపేతానికి, ప్రజా ఆరోగ్యం కోసం ఖర్చు చేయనున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించిన సమయంలో పేర్కొన్నారు.