CAA : కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో సీఏఏ అమలు కాదా.. రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించగలవా?

కేంద్ర ప్రభుత్వం సీఏఏ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో అమలుకు ఆస్కారం ఉండదు. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ లో చేర్చిన ..

CAA : కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో సీఏఏ అమలు కాదా.. రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించగలవా?

citizenship amendment Act

Updated On : March 12, 2024 / 8:22 AM IST

Bengal and Kerala State Government : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం విడుదల చేసింది. దీంతో భారతదేశంలో మూడు పొరుగు దేశాలు (పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్) నుంచి వలస వచ్చిన ముస్లీమేతర పౌరులకు భారతీయ పౌరసత్వం పొందేందుకు అవకాశం లభిస్తుంది. అయితే, చట్టం ద్వారా దేశవ్యాప్తంగా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పలువురు ఈ చట్టాన్ని ఆమోదిస్తుండగా.. మరికొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పశ్చిబెంగాల్, కేరళ ప్రభుత్వాలు సీఏఏను వ్యతిరేకించాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీఏఏ విషయంపై మాట్లాడుతూ.. మతం, కులం, భాష ప్రాతిపదికన వివక్ష చూపితే అంగీకరించబోమని చెప్పారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సీఏఏని అమలు చేయడానికి మేము అనుమతించబోమని చెప్పారు. మరోవైపు .. కేరళ రాష్ట్ర ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకిస్తుంది. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మాణం చేసిన రాష్ట్రం కేరళ. ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిసెంబర్ 2019లోనే కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది.

Also Read : CAA : పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి.. ప్రధాన నిబంధనలు ఏమిటో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం సీఏఏ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో అమలుకు ఆస్కారం ఉండదు. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ లో చేర్చిన అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు, బెంగాల్ ఈశాన్య సరిహద్దు నియంత్రణ 1973 కింద నోటిఫై చేసిన ద ఇన్నర్ లైన్ కు ఇది వర్తించదని చట్టంలో పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో గిరిజన ప్రజలకు రక్షణ కల్పించే లక్ష్యంతో ఇన్నర్ లైన్ పర్మిట్, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ లో చేర్చారు. మణిపూర్ ను ఇంతకుముందు ఇన్నర్ లైన్ పర్మిట్ లో చేర్చలేదు. కానీ తరువాత దానిని చేర్చారు. ఇన్నర్ లైన్ పర్మిట్ (ILP) అనేది భారతదేశంలో ఒక రక్షిత ప్రాంతంలోకి భారతీయ పౌరుడు ప్రవేశించడానికి, ప్రయాణించడానికి అనుమతినిస్తూ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం పరిమిత కాలానికి జారీ చేసే అధికారిక ప్రయాణ పత్రం.

Also Read : CAA : మోదీ సర్కారు సంచలన నిర్ణయం.. సీఏఏ అమలుకు నోటిఫికేషన్ జారీ

సీఏఏను రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించే అవకాశం ఉంటుందా అంటే.. ఉండదనే చర్చ తెరపైకి వస్తుంది. రాజ్యాంగంలో యూనియన్, రాష్ట్రం, ఉమ్మడి జాబితా ఉంది. ఏఏ సబ్జెక్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయని స్పష్టం ఉంది. వాటిని బట్టి చూసుకుంటూ కేంద్ర జాబితాలోకి వచ్చే అంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. మరోవైపు.. దేశ పౌరసత్వానికి సంబంధించింది కాబట్టి .. సీఏఏను ఏ హైకోర్టులోనూ సవాలు చేయలేరు. 2020 జనవరిలో సీఏఏకి సంబంధించిన ఏ కేసును హైకోర్టులో విచారించబోమని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. సీఏఏకు మద్దతుగా, వ్యతిరేకిస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో 200కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో కొన్నింటిని కోర్టు కొట్టివేయగా.. మరికొన్నింటిపై కోర్టులో విచారణ జరుగుతుంది.