CAA : పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి.. ప్రధాన నిబంధనలు ఏమిటో తెలుసా?

సీఏఏ ప్రకారం.. 31 డిసెంబర్ 2014 నాటికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, క్రిస్టియన్, పార్సీ అనే ఆరు మతాల శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది.

CAA : పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి.. ప్రధాన నిబంధనలు ఏమిటో తెలుసా?

Citizenship Amendment Act

Updated On : March 12, 2024 / 7:38 AM IST

Citizenship Amendment Act : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ) అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో మరో నెలరోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఏఏను మోదీ సర్కారు బ్రహ్మాస్త్రంలా బయటకు తీసింది. వాస్తవానికి సీఏఏ చట్టం -2019లోనే పార్లమెంట్ ఆమోదం పొందింది. రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. అయితే, విపక్షాల ఆందోళనలు, దేశ వ్యాప్తంగా నిరసనల కారణంగా అమల్లో జాప్యం జరిగింది. సార్వత్రిక ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలుసార్లు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయంలో సీఏఏను కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చింది.

Also Read : CAA: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అమిత్ షా కామెంట్స్

ప్రధాన నిబంధనలు ఏమిటి?
సీఏఏ అమలుతో భారతదేశంకు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చి భారతదేశంలో నివసిస్తున్న ముస్లీమేతర శరణార్థులకు పౌరసత్వం పొందడానికి మార్గం సుగమం అవుతుంది. అంటే.. భారత్ కు పొరుగు దేశాలైన మూడు దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు సీఏఏ వరంగా మారనుంది. 2019 డిసెంబర్ 11న పార్లమెంట్ లో సీఏఏ ఆమోదం పొందింది. అయితే, ఆ సమయంలో సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సీఏఏ అమలుకు వెనుకడుగు వేసింది. తాజాగా లోక్ సభ ఎన్నికల సమయం వేళ సీఏఏకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. భారత పౌరసత్వ చట్టం 1955 ఇప్పటి వరకు ఆరు సార్లు (1986, 1992, 2003, 2005, 2015, 2019) మార్పులు చేశారు. ఇంతకుముందు, భారత పౌరసత్వం పొందడానికి ఎవరైనా భారతదేశంలో 11 సంవత్సరాలు నివసించాల్సిన అవసరం ఉంది. కొత్త సవరణ చట్టంలో ఈ వ్యవధిని ఆరు సంవత్సరాలకు తగ్గించడం జరిగింది.

Also Read : Anti-CAA Protesters: సీఏఏ నిరసనల్లో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం.. రూ.57 లక్షలు చెల్లించాలంటూ పోలీసుల నోటీసులు

ముస్లింలను ఎందుకు చేర్చలేదు..
సీఏఏ ప్రకారం.. 31 డిసెంబర్ 2014 నాటికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, క్రిస్టియన్, పార్సీ అనే ఆరు మతాల శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. సీఏఏ నుంచి ముస్లీంలను మినహాయించారు. ఎందుకంటే.. మూడు దేశాల్లో ముస్లింలు మెజార్టీ సంఖ్యలో ఉన్నారు. వారు ఆయా దేశాల్లో అణచివేతకు గురికాబడటం లేదు. ఆ దేశాల్లో హిందువులు, ఇతర వర్గాలు మతం ఆధారంగా హింసకు గురవుతున్నారు. అందుకే ముస్లింలను ఈ చట్టంలో చేర్చలేదని అమిత్ షా పార్లమెంట్ లో తెలిపారు. అయితే, వారు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, దానిపై ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని గతంలో అమిత్ షా చెప్పారు.

 

  • చట్టం అమల్లో ఎప్పుడు ఏం జరిగింది?
    పౌరసత్వ సవరణ చట్టం-1955కి 2019లో సవరణ చేసిన కేంద్రం.
    2016లో పౌరసత్వ సవరణ బిల్లు తీసుకొచ్చిన కేంద్రం.
    2019లో ఆమోదం పొందిన బిల్లు.. ఇప్పటివరకు నిబంధనలను ప్రకటించని కేంద్రం.
    లోక్ సభ ఎన్నికల ముందే ఈ చట్టం తీసుకొస్తామని చెప్పిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.
    దేశ విభజన జరిగినప్పుడు పొరుగు దేశంలో వేధింపులకు గురవుతున్న మైనారిటీలకోసం కాంగ్రెస్ పార్టీ పౌరసత్వం కల్పిస్తామన్న వాగ్దానం చేసింది.. కానీ, అమలు చేయలేదు.. చట్టం తీసుకురాలేదు.
    ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
    2014 డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు బౌద్ధులు, పార్శీలకు వర్తించనున్న సీఏఏ.