Civil Aviation Ministry : ఇకపై విమానాల్లో భారత సంగీతం మాత్రమే వినిపించాలి!
భారత విమానయాన సంస్థలు నడిపే విమానాల్లో భారత సంగీతం వినిపించేలా ప్రోత్సాహించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు...

Indian Air
Play Indian Music : ఇకపై విమనాలు, విమానాశ్రయాల్లో కేవలం భారత సంగీతం మాత్రమే వినపడనుంది. ఇతర దేశాలకు సంబంధించిన సంగీతం వినిపించదు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ. భారత విమానయాన సంస్థలు నడిపే విమానాల్లో భారత సంగీతం వినిపించేలా ప్రోత్సాహించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఈనెల 23వ తేదీన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) లేఖ రాసింది.
Read More : Scientists Warning: అంతరిక్షంలోకి మనుషులు వెళితే చంపుకుతినడం ఖాయం: శాస్త్రవేత్తలు
ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆస్ట్రేలియా, పశ్చిమాసియా దేశాలు వారి వారి విమానాల్లో వారి దేశాలకు సంబంధించిన సంగీతం మాత్రమే వినిపిస్తున్నారని లేఖలో వెల్లడించింది. అమెరికా విమానాల్లో జాజ్, ఆస్ట్రేలియా విమానాల్లో మోజారత్, పశ్చిమాసియా దేశాల విమనాల్లో అరబ్ సంగీతాన్ని వినిపిస్తున్నారని పేర్కొంది. ఈ క్రమంలో…ఐసీసీఆర్ ఇచ్చిన లేఖ ప్రకారం…సింధియా సిఫార్సులు జారీ చేశారు.
Read More : Corona Vaccine : కరోనా వ్యాక్సిన్ వద్దంటూ చెట్టెక్కి కూర్చున్న యువకుడు
వీటిని పాటించాలని డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్, ఏఏఐ ఛైర్మన్ సంజీవ్ కుమార్ లకు..పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పాధి లేఖ రాశారు. భారత సంగీతానికి సుసంపన్నమైన వారసత్వం ఉందని, ప్రతి భారతీయుడు గర్వించే అనేక అంశాల్లో సంగీతం ఒకటని తెలిపారు. భారత్ లో నడిచే విమానాలత్లో భారతీయ సంగీతాన్ని వినిపించాలని ఐసీసీఆర్ సిఫార్సు చేసిందనే విషయాన్ని గుర్తు చేసింది. దీనిని విమానాయాన సంస్థలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు లేఖలో వెల్లడించింది.