Bengal CM : కేంద్ర ప్రభుత్వంతో బెంగాల్ సీఎం ఢీ అంటే ఢీ, సొంతగూటికి చేరుతున్న టీఎంసీ నేతలు..ఫుల్ జోష్‌లో సీఎం మమత

కేంద్ర ప్రభుత్వంతో బెంగాల్‌ సీఎం ఢీ అంటే ఢీ అంటున్నారు. తమ రాష్ట్రం విషయంలో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోనంటూ స్పష్టం చేస్తున్నారు. ఇటివల ముగిసిన బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించిన మమత...ఇప్పుడు దేశ రాజకీయాల వైపు ఫోకస్‌ చేశారు. అందులో భాగంగా ఎన్డీయేతర రాష్ట్రాలకు దీదీ కీలక ప్రతిపాదన చేశారు. రాష్ట్రాలు సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు మమత. రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం కొనసాగాలన్నారు.

Bengal CM : కేంద్ర ప్రభుత్వంతో బెంగాల్ సీఎం ఢీ అంటే ఢీ, సొంతగూటికి చేరుతున్న టీఎంసీ నేతలు..ఫుల్ జోష్‌లో సీఎం మమత

Bengal Cm

Updated On : June 10, 2021 / 1:38 PM IST

CM Mamata Banerjee : కేంద్ర ప్రభుత్వంతో బెంగాల్‌ సీఎం ఢీ అంటే ఢీ అంటున్నారు. తమ రాష్ట్రం విషయంలో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోనంటూ స్పష్టం చేస్తున్నారు. ఇటివల ముగిసిన బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించిన మమత…ఇప్పుడు దేశ రాజకీయాల వైపు ఫోకస్‌ చేశారు. అందులో భాగంగా ఎన్డీయేతర రాష్ట్రాలకు దీదీ కీలక ప్రతిపాదన చేశారు. రాష్ట్రాలు సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు మమత. రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం కొనసాగాలన్నారు. ఏదైనా రాష్ట్రం ఇబ్బందికి గురైనా, లేకపోతే కేంద్రం వైపు నుంచి దాడి జరిగినా మిగతా రాష్ట్రాలన్నీ వెంటనే స్పందించి అండగా నిలబడలన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి రాష్ట్రాలన్నీ ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం చేసే దుర్మార్గాలను అడ్డుకోవాలంటే ఎన్డీయేతర రాష్ట్రాలన్ని ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు దీదీ.

ఇక యువతరం అంతా మోదీ మాయలో బీజేపీలో చేరుతున్నారని.. ప్రముఖులు కూడా చాలా మంది బీజేపీలో చేరుతుండడం మంచి పరిణామం కాదన్నారు. వారంతా వెనక్కి వచ్చి వీలైతే ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసుకోవాలని మమత పిలుపునిచ్చారు. రైతులను కాపాడడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ఈ దేశ ప్రజల్ని కాపాడుకోవడానికి అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు దీదీ.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలై నెల రోజులు దాటినప్పటికి పశ్చిమ బెంగాల్‌లో పొలిటికల్ హీట్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఓ వైపు బీజేపీ నుంచి తమ సొంత గూటికి చేరుతున్న టీఎంసీ నేతలతో సీఎం మమత ఫుల్ జోష్‌లో ఉండగా.. బీజేపీ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. బీజేపీ వెస్ట్‌బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్‌కి ప్రతిపక్ష నాయకుడిగా ఇటివల ఎన్నికైన నందిగ్రామ్‌ ఎమ్మెల్యే సువేందు అధికారికి పడడం లేదన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. బీజేపీ ముఖ్య నేతల సమావేశానికి డుమ్మా కొట్టి మరి.. ఢిల్లీలోని బీజేపీ పెద్దలను సువేందు కలవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

అటు బీజేపీ ముఖ్య నేతల సమావేశానికి పలువురు ప్రముఖులు డుమ్మా కొట్టడం కాషాయ పార్టీలో కలకలం రేపుతోంది. సువేందుతోపాటు ఆ పార్టీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ముకుల్ రాయ్, మాజీ మంత్రి రాజీవ్ బెనర్జీ తదితరులు సమావేశానికి రాలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్న సువేందు ముఖ్యమైన సమావేశాన్ని వదిలిపెట్టి ఢిల్లీ ఎందుకు వెళ్లారన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇక్కడ సమావేశం ఉందన్న విషయం తెలిసి కూడా ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్లారన్నది తనకు తెలియదని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దిలీప్ ఘోష్ వ్యాఖ్యనించడం సంచలనంగా మారింది.

Read More : Y S Sharmila : రంగారెడ్డి జిల్లాకు రానున్న షర్మిల