ఏ బటన్ నొక్కినా బీజేపీకే : క్యూలో వెళ్లి ఓటు వేసిన కేరళ సీఎం

కేరళ సీఎం పిన్నరయి విజయన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కన్నూర్ జిల్లాలోని పిన్నరయిలోని ఆర్ సీ అమల బేసిక్ యూపీ స్కూల్ లోని పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడి వెళ్లి విజయన్ ఓటు వేశారు.సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగామంగళవారం(ఏప్రిల్-23,2019) 13 రాష్ట్రాలు,2కేంద్రపాలిత ప్రాంతాల్లో 117 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. కేరళలోని అన్ని లోక్ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగనుంది.కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
కేరళలోని 60కి పైగా పోలింగ్ బూత్ లలో వివిధ కారణాల కారణంగా పోలింగ్ ఆలస్యమయింది. సమస్యను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు చెర్తాలాలోని కిజక్కి నల్ పథిల్ పోలింగ్ బూత్ లోని ఈవీఎమ్ మిషన్లపై కంప్లెయింట్ లు వచ్చాయి. ఒటన్ నొక్కినా బీజేపీకి ఓటు పడుతుందని ఎల్ డీఫ్ కంప్లెయింట్ చేయడంతో 45నిమిషాల పాటు ఓటింగ్ కు అంతరాయం ఏర్పడింది.