Rajiv Gandhi Assassination: రాజీవ్ హంతకుల విడుదలపై సోనియా సుముఖం, కాంగ్రెస్ సీరియస్
మే 21, 1991 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని, సంతన్, మురుగన్, ఏజీ పెరారివాలన్, రాబర్ట్ పయస్, జయకుమార్, రవిచంద్రన్ నిందితులు. 1998లోనే ఏడుగురికి మరణశిక్షణ విధించిన ఉగ్రవాద వ్యతిరేక కోర్టు, అనంతరం అది యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. కుమార్తెను చూసుకోవాలన్న అభ్యర్థన మేరకు మొదట నళిని మరణశిక్షణు యావజ్జీ కారాగార శిక్షగా ధర్మాసనం మార్చింది

Congress disgree with sonia on rajiv killers release
Rajiv Gandhi Assassination: భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి వారి విడుదలపై సోనియా గాంధీ కుటుంబం సముఖత వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంలో తాము సోనియాతో విభేదిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ విషయమై తాము చట్టపరంగా ముందుకు వెళ్తామని ప్రకటించింది. దోషులు విడుదలైన అనంతరం శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు మాట్లాడారు.
‘‘ఈ విషయంలో సోనియా తెలిపిన అభిప్రాయం ఆమె వ్యక్తిగతమైందే కానీ పార్టీకి సంబంధించినది కాదు. రాజీవ్ హంతకుల విడుదలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సమర్ధించదు. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయంతో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఈ ఒక్క విషయంలో గాంధీ కుటుంబంతో పార్టీ ఎప్పటికీ ఏకీభవించదు. మేము ఎప్పటి నుంచో ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నాం’’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అన్నారు.
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. వారిని విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సుముఖత చూపటంతో పాటు సోనియాగాంధీ కుటుంబం నుంచి కూడా సానుకూలత రావడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా పట్టుబడి చాలా ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహర్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్, రాజా, శ్రీహరన్, జయకుమార్ అనే దోషులు తమ విడుదలపై చాలా రోజులుగా కోర్టుకు అప్పీలు చేసుకుంటున్నారు.
ఈ విషయమై మద్రాస్ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దోషులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం సహా అందరి అభిప్రాయాల తీసుకున్న అనంతరం దోషులను విడుదల చేయాలని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ నాగరత్నాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇదే కేసులో దోషిగా ఉన్న ఫెరరీవాలన్ను విడుదల చేస్తూ జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలనే మిగిలిన ఆరుగురికి వర్తించేలా జస్టిస్ గవాయి ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
మే 21, 1991 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని, సంతన్, మురుగన్, ఏజీ పెరారివాలన్, రాబర్ట్ పయస్, జయకుమార్, రవిచంద్రన్ నిందితులు. 1998లోనే ఏడుగురికి మరణశిక్షణ విధించిన ఉగ్రవాద వ్యతిరేక కోర్టు, అనంతరం అది యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. కుమార్తెను చూసుకోవాలన్న అభ్యర్థన మేరకు మొదట నళిని మరణశిక్షణు యావజ్జీ కారాగార శిక్షగా ధర్మాసనం మార్చింది. సెప్టెంబర్ 9, 2018న జరిగిన కేబినెట్ సమావేశంలో రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషుల క్షమాభిక్ష ప్రసాదించాలని తమిళనాడు సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనిని గవర్నర్కు సిఫారసు చేసింది. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్ తీవ్ర ఆలస్యం చేశారు.
ఆర్టికల్ 161ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించే అధికారాల మేరకు రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించాలని సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని నళిని, రవిచంద్రన్ సైతం సుప్రీం తలుపు తట్టారు. కాగా, ఈ దోషుల్లో ఒకరైన పెరివాలన్ 30 ఏళ్ల జైలు జీవితం అనంతరం ఈ మధ్యే విడుదలయ్యారు. తాజా సుప్రీం తీర్పుతో మిగిలిన వారు కూడా విడుదలకానున్నారు.
Siddhaanth Vir Surryavanshi : పునీత్ లానే.. సినీ పరిశ్రమలో మరో విషాదం.. జిమ్ చేస్తూ నటుడు మృతి