Yogi Adityanath : ఉగ్ర‌వాదానికి మాతృమూర్తి కాంగ్రెస్‌… యోగి సంచలన కామెంట్స్!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో సీఎం యోగి విరుచుకుపడ్డారు. ఉగ్ర‌వాదానికి మాతృమూర్తి కాంగ్రెస్ పార్టీ అంటూ మండిప‌డ్డారు.

Yogi Adityanath : ఉగ్ర‌వాదానికి మాతృమూర్తి కాంగ్రెస్‌… యోగి సంచలన కామెంట్స్!

Congress Is Mother Of Terrorism

Updated On : September 13, 2021 / 10:22 AM IST

Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో సీఎం యోగి విరుచుకుపడ్డారు. ఉగ్ర‌వాదానికి మాతృమూర్తి కాంగ్రెస్ పార్టీ అంటూ మండిప‌డ్డారు. శ్రీరాముడి పట్ల ప్రజల్లో విశ్వసాన్ని కించపరిచేలా చేస్తోందని, మాఫియాను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందంటూ ఆయన ఆరోపించారు. కుషిన‌గ‌ర్‌లో ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌ను యోగి ప్రారంభించారు. యూపీలో వ‌చ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేపథ్యంలో యోగీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.

Ganesh’s immersion : గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయనున్న తెలంగాణ ప్రభుత్వం

కాంగ్రెస్ ఉగ్ర‌వాదానికి మాతృమూర్తిని, దేశానికి న‌ష్టం కలిగించే వారిని చూస్తూ స‌హించలేమన్నారు. కాంగ్రెస్ వ్యాధులు తీసుకొస్తుంది. శ్రీ‌రాముడి ప‌ట్ల విశ్వాసాన్ని కించ‌ప‌రుస్తుందని, మాఫియాకు షెల్ట‌ర్ ఇస్తుందని మండిపడ్డారు. కానీ, దేశ ప్ర‌జ‌ల‌కు అయిన గాయాల‌ను బీజేపీ న‌యం చేస్తోందని, వారి క‌ష్టాలు ప‌రిష్క‌రిస్తుందని తెలిపారు. బీజేపీ ఉన్న చోటే ప్ర‌తి ఒక్క‌రికీ గౌర‌వం ఉంటుందని యోగి స్ఫష్టం చేశారు. మాఫియా, వ్యాధులు, నిరుద్యోగం, అవినీతి కాంగ్రెస్ పార్టీ పుణ్య‌మేనని విమర్శించారు. ఎస్పీ, బీఎస్పీ ప్ర‌భుత్వాలు రాష్ట్రానికి చేసిందేమిటనని ఈ సందర్భంగా యోగి ప్రశ్నించారు.

ప్ర‌ధాని మోదీ నాయ‌క‌త్వంలో బుజ్జ‌గింపు రాజ‌కీయాల‌కు చోటు లేదన్నారు. 2017కు ముందు అందరికి రేష‌న్ స‌రుకులు అందేవా? అని ప్రశ్నించారు. పాల‌కుల‌కు జై కొట్టిన వారికే రేష‌న్ స‌రుకులు ఇచ్చేవారని ఆరోప‌ించారు. తాలిబ‌న్ అనుకూల‌, కుల‌, వార‌స‌త్వ రాజ‌కీయాల‌ను యూపీ ప్ర‌జ‌లు సహించరని యోగి అన్నారు. బుజ్జ‌గింపు రాజ‌కీయాల‌కు, అవినీతికి ప్ర‌తిప‌క్ష పార్టీలు పెట్టింది పేర‌ని మండిప‌డ్డారు. ఈ దేశాన్ని ముందు బ్రిటిష్ వాళ్లు లూటీ చేశారని, ఆ త‌ర్వాత కాంగ్రెస్ అదేపని పార్టీ చేసిందని విమర్శలు చేశారు. రాముడిపై నెహ్రూకు కూడా న‌మ్మ‌కం లేదన్నారు. సాధువుల‌పై ఇందిరాజీ కాల్పులు జ‌రిపించారని విమర్మించారు.
Paytm: ‘మై చాయిస్‌ మై పేటీఎం’ అంటూ బుల్లితెర నటుల ప్రచారం!