Sonia Gandhi Illness : సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత.. గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. సోనియాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Sonia Gandhi Illness : సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత.. గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స

SONIA GANDHI

Updated On : March 3, 2023 / 2:32 PM IST

Sonia Gandhi Illness : కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. సోనియాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

గతంలో కూడా ఆమె అనారోగ్య కారణాలతో గంగారామ్ ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకున్నారు. రెగ్యులర్ చికిత్సలో భాగంగానే ఈ వైద్య పరీక్షలని తెలుస్తోంది.  ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

ఈ మేరకు సోనియా గాంధీని గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని.. రెగ్యులర్ చెకప్ లో భాగంగానే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.