ప్రేమే గెలుస్తుంది :ఓటు వేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటు వేశారు.ఢిల్లీలోని ఔరంగజేబ్ లేన్ లోని ఎన్ సీ సెకండరీ స్కూల్ లోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019)ఉదయం రాహుల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఓటు వేసిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.నోట్ల రద్దు,రైతుల సమస్యలు,గబ్బర్ సింగ్ ట్యాక్స్, రాఫెల్ డీల్ లో అవినీతి వంటి ఇష్యూల ప్రస్తావనగా ఎన్నికలు జరిగినట్లు రాహుల్ తెలిపారు.ఎన్నికల ప్రచారసమయంలో నరేంద్రమోడీ విద్వేషాన్ని చూపించాడని,కాంగ్రెస్ మాత్రం ప్రేమ చూపించినట్లు రాహుల్ తెలిపారు.ప్రేమే గెలుస్తుందన్న నమ్మకం తనకుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.
ఆరో దశలో భాగంగా ఇవాళ ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జార్ఖండ్ లోని 4లోక్ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది