Congress Protest : దేశంలో పెరిగిన ధరలపై కాంగ్రెస్ పోరుబాట.. మార్చి 31 నుంచి ర్యాలీలు..!
Congress Protest : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. అలాగే నిత్యావసర ధరలు కూడా దారుణంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పెరిగిన ధరల మంటకు నిరసనగా కాంగ్రెస్ పోరుబాట పట్టనుంది.

Congress Protest Congress To Protest Price Rise With Three Phase Campaign From March 31
Congress Protest : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. అలాగే నిత్యావసర ధరలు కూడా దారుణంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పెరిగిన ధరల మంటకు నిరసనగా కాంగ్రెస్ పోరుబాట పట్టనుంది. ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలకు నిరసనగా ‘మెహంగాయ్-ముక్త్ భారత్ అభియాన్’ పేరుతో మూడు దశల ప్రచారాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. దేశవ్యాప్తంగా ఈ ప్రచారాన్ని నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు దేశవ్యాప్తంగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.
మొదటి దశ ప్రచారంలో కాంగ్రెస్ మార్చి 31న గ్యాస్ సిలిండర్ షహీదీ దివస్‌గా పాటించనుంది. గృహాలకు సంబంధించి గ్యాస్ ధరల పెంపుపై కూడా కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేయనుంది. ఈ నెల ప్రారంభంలో ఎల్‌పిజి డొమెస్టిక్ గ్యాస్ ధరలను సిలిండర్‌కు రూ.50 పెంచారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం సమస్యను ఎత్తిచూపేందుకు పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఎల్‌పిజి సిలిండర్‌లకు పూలమాలలు వేస్తారని, డప్పులు కొడతారని, వంటగ్యాస్ ధరల పెరుగుదలపై పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం దృష్టిని ఆకర్షించాలని కోరారు.

Congress Protest Congress To Protest Price Rise With Three Phase Campaign From March 31
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా ఏప్రిల్ 2 నుంచి 4వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జిల్లా, బ్లాక్ స్థాయిలో కాంగ్రెస్ నిరసనలు, పాదయాత్రలు నిర్వహించనుంది. ఏప్రిల్ 7న, పార్టీ అన్ని రాష్ట్ర ప్రధాన కార్యాలయాల్లో సామాజిక, మత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజల సాయంతో మెహంగాయ్-ముక్త్ భారత్ ప్రదర్శనలు, మార్చ్‌లను నిర్వహిస్తుందని సుర్జేవాలా చెప్పారు. భారత ప్రజలను నరేంద్ర మోదీ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్లు, పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG), CNG ధరలను 137 రోజుల పాటు మార్చకుండా ప్రజల ఓట్ల కోసం మోసం చేసిందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
గత వారం రోజులుగా ప్రతి మధ్యతరగతి వారికి పీడకలలా మారాయని.. ‘ప్రజలను ఊడ్చిపెట్టండి.. ఖజానా నింపండి’ అనే మోడీ ప్రభుత్వ సూక్తిని రుజువు చేసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర చమురు కంపెనీలు శనివారం నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు 80 పైసలు పెంచాయి. ఢిల్లీలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ.98.61 కాగా, డీజిల్ ధర రూ.89.87గా ఉంది. గత వారం రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ.3.20 చొప్పున పెరిగాయి. చమురు వస్తువుల ధరల పెరుగుదల కారణంగా దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరి 2022లో గరిష్టంగా 6.07 శాతానికి పెరిగింది. కేంద్ర ధరలను పెంచిన నేపథ్యంలో ఏప్రిల్ 7న రాష్ట్ర రాజధానుల్లో కాంగ్రెస్ శ్రేణులు, ఎన్‌జీవోలు, ప్రజలు, సామాజిక సంస్ధలతో కలిసి ప్రదర్శనలు జరుగుతాయని సుర్జీవాలా పేర్కొన్నారు. పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరల పెంపుతో మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కార్ సామాన్యులపై పెను భారం మోపిందని సుర్జీవాలా ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also : Congress Protest : కాంగ్రెస్ దేశవ్యాప్త పోరు.. డప్పులు కొట్టాలి, గంటలు మోగించాలి