న్యూ ఇయర్: ఒంటి గంట కాదు.. ఐదింటి వరకు అవన్నీ ఓపెన్!

న్యూ ఇయర్ వచ్చేస్తోంది. ఇంకా ఒకరోజు సమయం మాత్రమే ఉంది. ఆ రాత్రంతా పబ్బులు, బార్లు, క్లబ్బులు, లిక్కర్ షాపులు కిటకిటలాడిపోనున్నాయి. ఎక్కడి చూసినా న్యూ ఇయర్ సెలిబ్రేషన్స్‌తో ఆహ్లాదరకమైన వాతావరణమే కనిపిస్తుంది.

  • Published By: sreehari ,Published On : December 30, 2018 / 11:50 AM IST
న్యూ ఇయర్: ఒంటి గంట కాదు.. ఐదింటి వరకు అవన్నీ ఓపెన్!

న్యూ ఇయర్ వచ్చేస్తోంది. ఇంకా ఒకరోజు సమయం మాత్రమే ఉంది. ఆ రాత్రంతా పబ్బులు, బార్లు, క్లబ్బులు, లిక్కర్ షాపులు కిటకిటలాడిపోనున్నాయి. ఎక్కడి చూసినా న్యూ ఇయర్ సెలిబ్రేషన్స్‌తో ఆహ్లాదరకమైన వాతావరణమే కనిపిస్తుంది.

  •  పబ్బులు, క్లబ్బులు, బార్లు ఫుల్ నైట్ తెరిచే ఉంటాయట

  • లైసెన్స్ ఉన్న షాపులకే అనుమతి.. ఫైర్ సేఫ్టీ తప్పనిసరి..

  • ముంబై పోలీసులు వెల్లడి.. చట్టపరమైన చర్యలతో అనుమతి 

న్యూ ఇయర్ వచ్చేస్తోంది. ఇంకా ఒకరోజు సమయం మాత్రమే ఉంది. ఆ రాత్రంతా పబ్బులు, బార్లు, క్లబ్బులు, లిక్కర్ షాపులు కిటకిటలాడిపోనున్నాయి. ఎక్కడి చూసినా న్యూ ఇయర్ సెలిబ్రేషన్స్‌తో ఆహ్లాదకరమైన వాతావరణమే కనిపించనుంది. వర్తమాన సంవత్సరానికి 2018కి వీడ్కోలు పలికి.. 2019 కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. చిన్నా, పెద్ద, ముసలి ముతకా అందరూ సంతోషంగా న్యూ ఇయర్ వేడుకల్లో బిజీగా గడిపేస్తారు. పబ్బుల్లో, నైట్ క్లబ్బుల్లో న్యూ ఇయర్ జోష్‌ అయితే చెప్పనక్కర్లేదు. ప్రతి ఏడాది న్యూ ఇయర్ రోజున రాత్రి ఒంటిగంట దాటితే చాలు.. అన్ని లిక్కర్, బీర్, వైన్ షాపులు, , విదేశీ మద్యం రిటైల్ షాపులన్నీ మూసివేయడం సర్వసాధారణమే. న్యూ ఇయర్ రోజు మద్యం గొంతులో పడాల్సిందే. లేకపోతే కిక్కే ఉండదుగా మరి. అలాంటి కిక్కు ఇచ్చే పబ్బులు, లిక్కర్ షాపులు, క్లబ్బులు వెంటనే మూసివేస్తే ఎట్లా.. ఎంజాయ్ చేసేదెట్లా.. అందుకే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బార్లు, లిక్కర్ షాపులు, నైట్ క్లబ్బులు తెల్లవారుజామున 5 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది.

ఇందులో లైసెన్స్ కలిగిన హోటళ్లు, బీర్ బార్లు, క్లబ్బులు, వైన్ షాపులకు మాత్రమే అనుమతి ఉంది. వీరంతా ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ముంబై పోలీసు అధికారి డీజీపీ మంజునాథ్ సింగే పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా యువసేన చీఫ్ ఆదిత్యా థాకరే రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. నగరంలో 24 గంటలపాటు షాపులు తెరిచేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. మరోవైపు న్యూ ఇయర్ వేడుకుల సందర్భంగా 18 సంస్థలు తమ వ్యాపారం కోసం షాపులను తెరిచి ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరాయి. వీటిలో ఒక సంస్థకు అగ్నిమాపక యంత్రాల ఏర్పాటుపై నిర్లక్ష్యంగా ఉన్నారనే కారణంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకల్లో భద్రత కోసం దాదాపు 40వేల మంది పోలీసులు నగరవ్యాప్తంగా మొహరించారు. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. పోలీసులు మఫ్కీల్లో జనంలో తిరగనున్నారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవారి భరతం పట్టేందుకు ప్రత్యేక పోలీసు బృందం రెడీగా ఉంది. ఇక న్యూ ఇయర్ రావడమే ఆలస్యం..