సమానత్వం కోసం : 620 కి.మీటర్ల మానవ హారం

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌  స్త్రీ-పురుష సమానత్వం చాటి చెప్పేందుకు మహిళలతో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. స్త్రీ-పురుష సమానత్వం, సామాజిక సంస్కరణలపై ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌  ‘‘వనితా మతిల్‌’’ పేరుతో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. 

  • Published By: veegamteam ,Published On : January 2, 2019 / 06:15 AM IST
సమానత్వం కోసం : 620 కి.మీటర్ల మానవ హారం

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌  స్త్రీ-పురుష సమానత్వం చాటి చెప్పేందుకు మహిళలతో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. స్త్రీ-పురుష సమానత్వం, సామాజిక సంస్కరణలపై ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌  ‘‘వనితా మతిల్‌’’ పేరుతో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. 

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌  స్త్రీ-పురుష సమానత్వం చాటి చెప్పేందుకు మహిళలతో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. స్త్రీ-పురుష సమానత్వం, సామాజిక సంస్కరణలపై ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌  ‘‘వనితా మతిల్‌’’ పేరుతో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. 

సముద్ర తీరం వెంబడి రహదారులపై మహిళలు, చిన్నారులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ ఉద్యోగులతో సహా పలువురితో జనవరి 1 సాయంత్రం ఉత్తరాన కాసర్‌గాడ్‌ నుంచి దక్షిణాన తిరువనంతపురం వరకు 620 కిలోమీటర్ల పొడవున దాదాపు 40 లక్షల మందికి పైగా మహిళలు ఈ భారీ మానవహారంలో పాల్గొన్నారు. బలవంతపు సంప్రదాయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడతామనే నినాదంతో ఈ  మహా మానవహారంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ భారీ మానవ హారం వలన ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంది. నిర్భంధ సంప్రదాయాల నుండి రాష్ట్రాన్ని కాపాడతామంటు అందరు ప్రతిన పూనారు.  

ఈ భారీ మానవ హారంలో భాగంగా కాసర్‌గాడ్‌లో ఈ వనితా మతిల్‌కు ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ సారథ్యం వహించగా..తిరువనంతపురంలో మానవహారం చివరన సీపీఐ(ఎం) పాలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌ నిలబడ్డారు. ఈ సందర్భంగా బృందా కరత్ మాట్లాడుతు..రాష్ట్ర మహిళలకు ఇదొక చరిత్రాత్మకమైన రోజని..కొంతమంది రాష్ట్రాన్ని తిరోగమనం వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మహిళలు దాన్ని ఎంతమాత్రం చేయనిచ్చేందుకు సిద్ధంగా లేరని ఈ వనితా మతిల్‌ తో చాటి చెప్పారన్నారు. ఈ భారీ కార్యక్రమం కోసం  కొన్ని పాఠశాలలకు మధ్యాహ్నం నుంచి సెలవును ప్రకటించగా కొన్ని కాలేజ్ ల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. దీంతో బాలికలు కూడా మానవహారంలో భారీగా పాల్గొన్నారు.