పెద్దల సభ : ట్రిపుల్ తలాక్
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ తలాక్ బిల్లుకు పెద్దలసభలో కాంగ్రెస్ నుంచి గట్టి ప్రతిఘటనే ఎదురయ్యే అవకాశాలున్నాయి.

కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ తలాక్ బిల్లుకు పెద్దలసభలో కాంగ్రెస్ నుంచి గట్టి ప్రతిఘటనే ఎదురయ్యే అవకాశాలున్నాయి.
ఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ తలాక్ బిల్లుకు పెద్దలసభలో కాంగ్రెస్ నుంచి గట్టి ప్రతిఘటనే ఎదురయ్యే అవకాశాలున్నాయి. తక్షణ తలాక్‌ను నేరంగా పరిగణిస్తున్న ప్రస్తుత బిల్లును యథాతథంగా ఆమోదించే ప్రసక్తే లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తేల్చి చెప్పారు. 10 ప్రతిపక్షపార్టీలు వ్యతిరేకించాయంటూ గుర్తు చేసిన కాంగ్రెస్.. బిల్లులోని కొన్ని నిబంధనలు తమకి అభ్యంతరకరమంటూ చెబుతోంది. జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపించాలంటూ డిమాండ్ చేస్తోంది.
లోక్‌సభలో ఆమోదం…
ట్రిపుల్ తలాక్ బిల్లు విపక్షాల వాకౌట్ మధ్య లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. బిల్లుకు అనుకూలంగా 245 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. తర్వాత న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ….రాజ్యసభలోనూ బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించారు. అందుకు అనుగుణంగానే సోమవారం రాజ్యసభ ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందకుండా ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెస్ నిలువరిస్తుందని తెలుస్తోంది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు -2018ను లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు 10 విపక్ష పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేశాయని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. వివిధ అంశాలపై ప్రభుత్వానికి మద్దతిచ్చిన అన్నాడీఎంకే కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తోందని వాదిస్తోంది.
మరోవైపు బిజెపి మాత్రం తలాక్ బిల్‌తో మహిళలకు అన్యాయం జరిగినప్పుడు ఓ చట్టమంటూ ఉంటే భరోసా ఉంటుందని..దాన్ని అడ్డుకోవడం తగదని చెప్తోంది. పార్టీ పార్లమెంట్ సభ్యులకు బీజేపీ విప్ జారీ చేసింది. డిసెంబర్ 31 సోమవారం తప్పకుండా రాజ్యసభకు హాజరు కావాలని ఎంపీలకు సూచించింది.