Gen Bipin Rawat : రావత్‌కు నివాళి..50 కి.మీటర్ల మేర బారులు తీరిన ప్రజలు
13 అంబులెన్స్ లో భౌతికకాయాలను కూనూరు నుంచి సూలురు ఎయిర్ బేస్ కు తరలించారు. మెట్టుపాల్యం నుంచి సూలురు వరకు ప్రజలు బారులు తీరి నివాళులర్పించారు.

Bipin Rawat
Coonoor IAF Chopper Crash : భారత్ మాతాకీ జై…వీర వణక్కం రావత్..అనే నినాదాలతో తమిళనాడు మారుమ్రోగింది. రాష్ట్రంలో భావోద్వేగ పూరితంగా ప్రజలు వీడ్కోలు పలికారు. సుమారు 50 కి.మీటర్ల మేర ప్రజలు బారులు తీరి భౌతికకాయాలు తరలిస్తున్న అంబులెన్స్ లపై పూలుచల్లి నివాళులర్పించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం మధ్యాహ్నాం జరిగిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులతో సహా మొత్తం 13 మంది మరణించిన విషయం తెలిసిందే.
Read More : Omicron Variant: ఏపీలో ఒమిక్రాన్ అలర్ట్.. రూ.25వేల వరకు జరిమానా!
13 అంబులెన్స్ లో భౌతికకాయాలను కూనూరు నుంచి సూలురు ఎయిర్ బేస్ కు తరలించారు. మెట్టుపాల్యం నుంచి సూలురు వరకు ప్రజలు బారులు తీరి నివాళులర్పించారు. మరోవైపు…దివంగత బిపిన్ రావత్ పై ఏడీజీ పీఐ – ఇండియన్ ఆర్మీ భావోద్వేగ పూరిత ట్వీట్ చేసింది. మన జాతీయ పతాకం గాలి కారణంగా రెపరెపలాడదు. దేశాన్ని కాపాడేందుకు ప్రాణత్యాగాలు చేసే సైనికుల తుదిశ్వాసతో అది రెపరెపలాడుతుంది..ట్వీట్ చేసింది. బిపిన్ రావత్ చిత్రాన్ని కూడా షేర్ చేసింది. ఆన్ లైన్ లో నివాళి అర్పించేందుకు భారత సైన్యం ఓ ప్రత్యేకమైన లింక్ ను ట్వీట్ లో ఉంచింది. అమూల్ సంస్థ కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. బిపిన్ రావత్ పై వేసిన కార్టూన్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. సైనిక ఖడ్గంతో నడుచుకుంటూ..రావత్ వస్తున్నట్లు ఉంది. శత్రువు పాలిట ఖడ్గం ఆయన అంటూ పేర్కొంది.
Read More : Poorna : బాలయ్యకి సాష్టాంగ నమస్కారం చేసిన పూర్ణ
హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరగుతున్నాయి. ఇద్దరి పార్థివ దేహాలను ఢిల్లీలోని వారి స్వగృహంలో ఉదయం 11 గంటల నుంచి ప్రజల సందర్శనార్థం ఉంచారు. కామరాజ్ మార్గ్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతం వరకు అంతిమయాత్ర నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4గంటలకు బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సీడీఎస్ బిపిన్ రావత్‌తో సహా.. 13మంది అమరులకు యావత్ దేశం నివాళులర్పిస్తోంది.